ఒక దేశం-ఒక జీఎస్టీ-అనేక సందేహాలు

GST Launch People have More Doubts on GST implementation

ఒక దేశం–ఒకే పన్ను నినాదంతో 18 రకాల పరోక్ష పన్నుల స్థానంలో ప్రవేశపెడుతున్న జీఎస్టీకి రంగం సిద్ధమైంది. స్వతంత్ర భారతంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా అభివర్ణిస్తున్న జీఎస్‌టి చట్టం ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి రానుంది. పార్లమెంటు సెంట్రల్‌ హాలులో జరిగే ఆరంభ వేడుకకు కొన్ని రాజకీయ పార్టీలు డుమ్మాకొడుతున్నప్పటికీ రాజకీయ అతిరథ మహారథులందరూ హాజరవుతున్నారు.

GST Launch People have More Doubts on GST implementation

అయితే కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న జీఎస్టీపై ఇంకా దేశవ్యాప్తంగా ఆందోళనలు, అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. జీఎస్టీ అమలు ప్రజలకు ఎలాంటి ఫలితాలను అందిస్తుందనే ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాలు.. ఇలా అన్ని వర్గాలపైనా జీఎస్టీ ప్రభావం ఎలా ఉంటుంది? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? అనే సందేహాలకు ఇప్పటికీ స్పష్టత రాలేదు. జీఎస్టీ పన్ను శ్లాబుల్లో చేర్చిన వస్తువులను బట్టి చూస్తే  సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

See Also: జీఎస్టీ పరిధిలోకి వస్తే పెట్రోలు 40/- రూపాయల్లోపే

ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపై పూర్తిగా పన్ను ఎత్తివేయడంతో నిత్యావసరాల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అవి మినహా నిత్యం వినియోగించే వస్తువుల ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్న దానిపై రెండు మూడు నెలలు గడిచిన తర్వాతే స్పష్టత రానుంది. కొన్ని వర్గాలకు జీఎస్టీతో లాభం ఉంటుందని చెబుతున్నా.. ఏ మేరకు లాభం ఉంటుంది, ఏ తరహాలో ప్రయోజనం చేకూరుతుంది, అసలు లాభం ఉంటుందా లేదా అన్నదానిపైనా ఎన్నో సందేహాలున్నాయి.

మరోవైపు సందట్లో సడేమియాలాగా కొన్ని సంస్థలు జీఎస్టీ అమలుతో పన్నులు తగ్గుతుండడంతో హడావిడిగా కొంతమంది రేట్లు పెంచేశారు. అందులో విజయ డైరీ వాళ్ళు పెంచిన పాల రేట్లు రేపటినుండి అమలులోకి వస్తాయని చెప్పేశారు. ఇలా ఎన్నో సంస్థలు ఇప్పటికే తమ వస్తువుల ధరలను పెంచేశారు. సామాన్యులు వాడే ఆహార పదార్థాలపై పన్ను లేకపోవడం, లేదంటే తగ్గింది.

See Also: జీఎస్టీతో రైతన్నలపై మరింత భారం

 

దేశమంతా ఒకే జీఎస్టీ ఉండటంతో రకరకాల పన్నుల నుంచి వినియోగదారులకు విముక్తి లభిస్తోంది. అంతేకాక కొన్ని వస్తువులపై పన్ను భారం కూడా వినియోగదారుడిపై పడనుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ రాకముందు వివిధ వస్తువుల పన్ను రేట్లు ఏ విధంగా ఉన్నాయి? వచ్చిన తర్వాత వాటిపై పన్ను భారం లేదా లాభం ఏ మేర ఉండబోతుందో ఓ లుక్కేద్దాం…

చాక్లెట్లు, బిస్కెట్లు : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
కేకులు, పేస్ట్రీలు : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
ఐస్‌ క్రీంలు: ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
నెయ్యి : ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
వెన్న : ప్రస్తుతం 14.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
చక్కెర : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
టీ పొడి : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
కాఫీ పొడి : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%

See Also: జీఎస్టీ లాంచ్- దూరంగా ఉండాలని నిర్ణయించిన కాంగ్రెస్

సిమెంట్‌ : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
మొబైల్స్‌ : ప్రస్తుతం 6%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
టీవీలు : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
వైద్య పరికరాలు : ప్రస్తుతం 18%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
మైక్రోవేవ్‌ ఓవెన్‌ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
ఫ్రిడ్జ్‌ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28 %
వాషింగ్‌ మెషిన్‌ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28 %
సబ్బులు : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
టూత్‌పేస్ట్‌ : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
హెయిర్‌ ఆయిల్‌ : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
ఆయుర్వేద మందులు : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
బంగారం : ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 3%
ఫర్నీచర్‌ : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
కంప్యూటర్లు/ల్యాపీలు : ప్రస్తుతం 6%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
ద్విచక్రవాహనాలు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
చిన్నకార్లు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 29%
మీడియం కార్లు : ప్రస్తుతం 47%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43%
పెద్ద కార్లు : ప్రస్తుతం 49%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43%
ఎస్‌యూవీ కార్లు : ప్రస్తుతం 55%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43%
కమర్షియల్‌ వాహనాలు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%

రెడీమేడ్‌ దుస్తులు : (రూ.1000 కంటే తక్కువ)- ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 2.5%
రెడీమేడ్‌ దుస్తులు : (రూ.1000 కంటే ఎక్కువ)- ప్రస్తుతం 12%, జీఎస్టీ వచ్చిన తర్వాత 4.5%
చెప్పులు, బూట్లు : (రూ.500 వరకు)- ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
చెప్పులు, బూట్లు : (రూ.500 నుంచి రూ.1000 వరకు)- ప్రస్తుతం 20.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
చెప్పులు, బూట్లు : (రూ.1000పైన)- ప్రస్తుతం 26.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%

Have something to add? Share it in the comments

Your email address will not be published.