మోగిన జీఎస్టీ ఢంకా – నేటి నుండి అమలు

GST Launched Govt Rolled Out The Biggest Tax Reform

ఒకే దేశం.. ఒకే పన్ను విధానమంటూ చారిత్రాత్మక పన్ను విధానం జీఎస్టీ నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చేసింది. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలు సాక్షిగా ఎంతో అట్టహాసంగా జరిగిన వేడుకలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్టీని ప్రారంభించారు. దీంతో నేటి నుండి దేశమంతా ఒకే జీఎస్టీతో రకరకాల పన్నుల నుంచి వినియోగదారులకు విముక్తి దొరికింది.

GST Launched Govt Rolled Out The Biggest Tax Reform

పార్లమెంట్‌ సెంట్రల్‌హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, మాజీ ప్రధాని దేవగౌడ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ దేశం కొత్తదారిలో నడిచేందుకు సిద్ధంగా ఉంది. జీఎస్టీ కేవలం ఆర్థిక సంస్కరణలకే కాదు.. దేశాన్ని ఒకే దారిలో నడిపించే ప్రక్రియ. దేశీయ మార్కెట్‌కు జీఎస్టీ గొప్ప ఉదాహరణగా నిలవబోతోంది. ఈ కొత్త వ్యవస్థ ఏ రాజకీయ పార్టీకో, వ్యక్తులకో చెందినది కాదు. ఇది అందరి విజయం.

See Also: ఒక దేశం-ఒక జీఎస్టీ-అనేక సందేహాలు

అనేక చర్చోపచర్చల తర్వాత ఏర్పాటైన జీఎస్టీ, అఖిలపక్ష వాదనల నుంచి మధ్యేమార్గం ఎంచుకుని జీఏస్టీ కౌన్సిల్ ఏర్పాటైంది. మనలో ఉన్న టీమిండియా అనే భావనకు జీఎస్టీ ఒక కొత్త ఉదాహరణ. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నట్లే .. జీఎస్టీ కోసం 18 సమావేశాలు జరిగాయి. ఇప్పటినుండి దేశం మొత్తం ఒకటే మార్కెట్‌గా అయిపోయింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో జీఎస్టీ అవసరంలేదంటూ తమ విముఖత వ్యక్తం చేసినప్పటికీ దేశం మొత్తం ఒకే విధానాన్ని తీసుకరావాలనే సంకల్పం జీఎస్టీ కలను సాకారం చేసిందని స్పష్టంచేశారు నరేంద్ర మోడీ.

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మాట్లాడుతూ ‘ 2009లో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ జీఎస్టీపై ప్రథమ ముసాయిదా ఇచ్చింది. 2011, 2012లో నేనే స్వయంగా మంత్రుల కమిటీతో చర్చలు జరిపాను. ఏపీ, బిహార్‌, గుజరాత్‌ సీఎంలతో స్వయంగా చర్చలు జరిపారు. సీఎంలు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిరంతర చర్చల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని ప్రణబ్‌ముఖర్జీ తన ప్రసంగంలో తెలిపారు.

See Also: జీఎస్టీ పరిధిలోకి వస్తే పెట్రోలు 40/- రూపాయల్లోపే

జీఎస్టీ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభోపన్యాసం చేశారు. ‘దేశం సాధించిన గొప్ప విజయం జీఎస్టీ. జీఎస్టీతో కొత్త ప్రయాణం ప్రారంభమవుతోంది. జీఎస్టీతో ఇకపై ఒకే దేశం – ఒకే పన్ను. జీఎస్టీ కల సాకారానికి రాష్ట్రాలు, అధికారులు ఎంతగానో శ్రమించారు. ఎన్డీఏ-1 పాలనలో జీఎస్టీ అంశం తెరపైకి వచ్చింది. విజయ్‌ కేళ్కర్‌ తన నివేదికలో జీఎస్టీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. యూపీఏ ప్రభుత్వం జీఎస్టీ తదుపరి ప్రక్రియను కొనసాగించింది. జీఎస్టీ అమలుకు 15ఏళ్ల సమయం పట్టింది. దేశంలో అతిపెద్ద పన్నుల సంస్కరణ ప్రారంభం కాబోతోంది’ అని జైట్లీ స్పష్టంచేశారు.

రైతులకు ఊరట

జీఎస్టీ అమలులోకి వచ్చేసింది. రైతులపై ఈ జీఎస్టీ భారం చాలా ఎక్కువగా పడుతోందని విమర్శలొచ్చాయి. అయితే జీఎస్టీ అమలుకు ముందు ఈరోజు భేటీ అయిన జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విమర్శలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం  రైతులకు భారం కానున్న ఎరువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అంతేగాక ట్రాక్టర్, స్పేర్‌పార్ట్స్‌పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఇది రాబోయే రోజుల్లో మరింత తగ్గొచ్చని అంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.