జీఎస్టీ పరిధిలోకి వస్తే పెట్రోలు 40/- రూపాయల్లోపే

GST will affect the petrol and diesel prices in India

దేశం మొత్తం అందరి దృష్టి ఇప్పుడు ఒక్క విషయం పైనే ఉంది. అదే జీఎస్టీ. జూలై1 తేదీ నుండి అమలులోకి రానున్న జీఎస్టీతో దేశంలో కొత్తగా రానున్న మార్పులు అనేకంగా ఉన్నాయి. అయితే జీఎస్టీలోకి అనేక వస్తువులను సేవలను తీసుకొచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఎంతో కీలకమైన పెట్రోలియం ఉత్పత్తులను ఎందుకు జీఎస్టీలోకి తీసుకురావట్లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

GST will affect the petrol and diesel prices in India

కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను ఎందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు? పెట్రోలు,డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ 23%, రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్34%, మొత్తం  అన్ని రకాల పన్నులు కలుపుకొని వినియోగదారుల దగ్గర 57% పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే జీఎస్టీ నుంచి పెట్రోల్‌ను ఎందుకు మినహాయించారు? బడా కార్పోరేట్లకు లాభం చేకూర్చడానికా? పెట్రోలియం ఉత్పతులను జీఎస్టీలోకి తేవడం వల్ల ప్రజలకు లాభమా నష్టమా? ఒకవేళ పెట్రోలియంను జీఎస్టీ జాబితాలో చేరిస్తే రాష్ట్రాలకు వచ్చే ఆదాయం పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదళ్ళను తొలుస్తున్నాయి.

ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నో ఏళ్ళుగా పెట్రోలియం కొరకు కడుతున్న పన్నులను తగ్గించాలని అందరికీ నిత్యావసర వస్తువులైన పెట్రోలు, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే  అందులో ఉన్న అత్యధిక పన్ను 28% మాత్రమే. దీని వల్ల పెట్రోలు, డీజిల్ ధరలు 50% కి పైగా తగ్గుతాయి. ప్రజలకు సైతం ఎంతగానో ఉపయోగపడుతుంది.

See Also: స్వచ్ఛభారత్ అంటే ఇదేనా??

మనదేశంలోచమురు సంస్థలు పెట్రోల్‌ను లీటరు 27 రూపాయలకే కొనుగోలు చేస్తున్నా.. దానికి ప్రాసెసింగ్ ఫీజు, రవాణా వ్యయం, ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్ కలిపి లీటర్ పెట్రల్‌ను 65-70 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. పెట్రోలు కొనుగోలు, రవాణా ఖర్చులు కలిపితే లీటరుకు బేస్‌ ధర 27 రూపాయల 40 పైసలుగా ఉంది. దానికి డీలర్‌ కమీషన్‌ కలిపితే కూడా 30 రూపాయలు దాటదు. దీనికి గరిష్ఠంగా ఉన్న 28 శాతం జీఎస్టీ కలిపినా పెట్రోలు ధర 40 రూపాయలలోపే ఉంటుంది. డీజిల్ ధర కూడా భారీగా తగ్గుతుంది. అయితే పెట్రోలియం ఉత్పత్తులకు జీఎస్టీని అమలుచేస్తే ఈ రంగంలో కార్పోరేట్లు జనాల జేబుల్ని పిండుకోవడానికి ఉన్న ఛాన్స్‌కు దెబ్బపడుతుంది.

2010లో పెట్రోలు, 2014లో డీజిల్‌ ధరలపై సబ్సిడీలు తొలగించి, ధరలపై ఉన్న ప్రభుత్వ అదుపును ఎత్తివేశాక రిలయన్స్‌, ఎస్సార్‌ వంటి దేశీయ సంస్థలు అదనంగా ఎనిమిది వేల బంకులు ఏర్పాటు చేసేందుకు అనుమతులు పొందాయని క్రిసిల్‌ నివేదిక వెల్లడించింది. ఇప్పటికే దేశంలో షెల్‌ కంపెనీ భారీ విస్తరణకు అనుమతులు పొందింది. అంతర్జాతీయ దిగ్గజాలైన రాస్‌నెఫ్ట్‌ (రష్యా), అటీసు పెట్రోలియం (యూకే), ఆరామ్‌కో (సౌదీ), రాయల్‌ డచ్‌ స్టాండ్‌ (నెదర్లాండ్‌) రానున్న మూడేళ్ళలో భారత గడ్డపై అడుగుపెట్టడానికి భారీగా లాబీయింగ్‌ చేస్తూ సన్నాహాలు చేసుకున్నాయి.  ఈ విదేశీ సంస్థలుగనక భారత్‌లో అడుగు పెడితే ఇప్పటికి 95 శాతం వాటాతో ఉన్న భారత పెట్రోలియం సంస్థలన్నీ దివాలా తీయడం ఖాయం. అందుకే ఇప్పటికీ ఎంతోమంది అభ్యర్థించినా కేంద్రం మాత్రం పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు.

See Also: జీఎస్టీతో రైతన్నలపై మరింత భారం

అయితే దేశ ఆర్థికాభివృద్ధి కోసం పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిందిగా జీఎస్టీ కౌన్సిల్‌ను కోరామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. అయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరుల్లో పెట్రో ఉత్పత్తులే ప్రధాన ఆదాయ వనరు కావడంతో జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావడానికి మోకాలడ్డే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు.

See Also: జీఎస్టీ లాంచ్- దూరంగా ఉండాలని నిర్ణయించిన కాంగ్రెస్

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.