గుడివాడలో ఓటుకి 7వేలు..?

Gudivada Bypoll Money flow high in Gudivada Muncipal bypoll

Gudivada Bypoll Money flow high in Gudivada Muncipal bypoll

ఎన్నికల సమయంలో జరిగే రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు నోట్ల కట్టలు ఏరులై పారుతున్నాయి. వార్డు మెంబరు ఎన్నిక దగ్గరినుండి పార్లమెంట్ ఎన్నికల వరకు ఓటర్లు మభ్యపెట్టేందుకు కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. 500 రూపాయల నుండి ప్రారంభమయ్యే రేటు ఎవరిస్థాయిని బట్టి వాళ్ళు ఓటర్లకు పంచుతుంటారు.

లేటెస్ట్‌గా అటు తమిళనాడు ఆర్కెనగర్ ఉపఎన్నికల్లో డబ్బులు ఎలా చేతులు మారుతున్నాయో ఐటీ రైడ్‌ల పుణ్యమా అని అందరికీ తెలిసిపోయింది. మరోవైపు కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీలో జరుగుతున్న 19వ వార్డు ఉపఎన్నికల్లో డబ్బులు ఏరులై పారుతున్నాయి. రెండు పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పార్టీలు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాయి.

వైఎస్సాఆర్సీపీకి చెందిన వార్డు సభ్యుడు మృతిచెందడంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఓ వర్గం ఓటుకు 7వేల రూపాయల వరకు ఓటర్లకు ముట్టచెబుతోంది. మరో వర్గం ఓటుకు 6వేల రూపాయలతో పాటు వెండి కుంకుమ భరిణలు పంపిణీ చేస్తున్నారు. అంతేగాక  2902 ఓట్లు ఉన్న ఈ వార్డులో ఒక్కో అభ్యర్థి కోటి రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి రావి వెంకటేశ్వరరావు, వైకాపా నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని డబ్బులను ఏరులా పారిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.