ఆర్భాటంగా గల్ఫ్ ప్రచార చిత్రాల విడుదల

gulf-movie-motion-poster-released-by-minister-ganta-srinivasrao-and-satyanand
పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన గల్ఫ్ చిత్రం వచ్ఛే నెల జూన్ లో విడుదల కు పరుగులు పెడుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు గల్ఫ్ ప్రచార చిత్రాలని విశాఖపట్నంలో ఆర్భాటంగా విడుదల చేసారు. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంద్ర ప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు మరియు ప్రఖ్యాత స్టార్ మేకర్ సత్యానంద్ విచ్ఛేసారు. మంత్రి గంటా శ్రీనివాస రావు కాన్సెప్ట్ లోగో ని విడుదల చేయగా, సత్యానంద్ మోషన్ చిత్రాన్ని విడుదల చేసారు. 
 
మంత్రి గంట శ్రీనివాస రావు మాట్లాడుతూ గల్ఫ్ చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ని ప్రత్యేకంగా అభినందించారు. సునీల్ కుమార్ రెడ్డి ఏ చిత్రం ప్రారంభించినా సంబంధిత అంశం పై పరిశోధన చేసి చేస్తారని, గల్ఫ్ వలస కార్మికుల సమస్యల పై పరిశోధన చేసి, గల్ఫ్ చిత్రం తీస్తున్నందుకు అభినందించారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పై ప్రత్యేక శ్రద్ధ తో ఈ చిత్రం తీస్తూ, తన చిత్రం ద్వారా ప్రజలలో చైతన్యం కలిగానిచడానికి ప్రయత్నిస్తున్న సునీల్ కుమార్ రెడ్డి అభినందనీయుడని మంత్రి కొనియాడారు. మంత్రి గంటా శ్రీనివాస రావు గల్ఫ్ చిత్ర  కాప్షన్    ‘సరిహద్దులు దాటిన ప్రేమ కధ’ అందరి మనసులకి హత్తుకుంటుందని తెలిపారు. సునీల్ కుమార్ రెడ్డి గల్ఫ్ తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించే చిత్రం అవుతుందని పేర్కొన్నారు. 
Gulf Movie motion poster released by Minister Ganta SrinivasRao and Satyanand
 
ప్రఖ్యాత స్టార్ మేకర్ సత్యానంద్ మాట్లాడుతూ సునీల్ కుమార్ రెడ్డి తన చిత్రాలలో సమకాలీన సమస్యల మీద పోరాడారని, గల్ఫ్ చిత్రం కూడా దేనికి తీసిపోదని తెలిపారు. సత్యానంద్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఎందరో నటులు తన ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొంది స్టార్లు అయ్యారని, తన ఇన్స్టిట్యూట్  విద్యార్ధి చేతన్ ఈ చిత్రంతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత రామ్ కుమార్ తనయుడు చేతన్ గల్ఫ్ చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. చేతన్ మాట్లాడుతూ గల్ఫ్ తన రెండవ చిత్రం అని, ఈ చిత్రంతో ప్రేక్షకులకి మరింత దగ్గర అవుతానని ఆకాంక్షించాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.