నేడు `బంకు శీను` పుట్టిన రోజు

అదివరకు కామెడీకి ప్రత్యేకంగా కమేడియన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోలే కామెడీ చేసేస్తున్నారు. హీరోలు కామెడీ చేయడమే కాదు, కామెడీ చేసేవారు హీరోలు కూడా అవుతున్నారు. హాస్యంతో ఆకట్టుకునే కమేడియన్స్ హీరోలుగా కూడా రాణిస్తున్నారు. కమేడియన్ సునీల్ కూడా ఈ కేటగిరీకే వస్తాడు. నేడు సునీల్ బర్త్ డే.

జనరల్ గా కమేడియన్స్ ను చూడగానే నవ్వొచ్చేస్తుంది. వారి పర్సనాలిటీ పెక్యూలియర్ గా ఉంటుంది. జనాన్ని నవ్వించే ఒక ప్రత్యేకమైన ఆకార విశేషంతో అలరిస్తారు. కామెడీ హీరో సునీల్ కు కూడా ఆ స్పెషాలిటీ ఉంది. ముఖ్యంగా పెదాల్ని కాస్త వంకరగా పెట్టి సునీల్ నవ్వే నవ్వు, చెప్పే డైలాగ్ చూడాలి మరి.

ఏవో చిన్న చిన్న డాన్సులు చేస్తూ సినిమా ఫీల్డ్ లోకి ఎంటరైన సునీల్ అసలు పేరు సునీల్ వర్మ. కమేడియన్ కాకముందు సునీల్ ఆర్ట్ డైరెక్టర్ అవుదామనుకున్నాడు. విలన్ రోల్స్ వేయాలనుకున్నాడు. కానీ చివరికి కమేడియన్ అయ్యాడు. కమేడియన్ గా అవార్డులూ అందుకున్నాడు.

ప్రతి కమేడియన్ వెనకా కష్టాలుంటాయట. సునీల్ కూడా కష్టాల్లోంచే వచ్చాడు. సినిమాల్లోకి వచ్చి కమేడియన్ గా మాంఛి రేంజ్ లో ఉన్న టైంలోనే సునీల్ హీరోగా కటింగ్ ఇచ్చాడు.  అందాలరాముడు, మర్యాదరామన్న సినిమాలతో   కామెడీ హీరోగా సునీల్ కు మంచి పేరొచ్చింది. అతనికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.