హవాలా వేట మొదలైంది

Hawala Mahesh sent to 14 days remand and the case handed over to CID

Hawala Mahesh sent to 14 days remand and the case handed over to CID

హవాలా వేట మొదలైంది. 1500 కోట్ల రూపాయల హవాలా కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు వడ్డి మహేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. హవాలా కేసును ఇతరదేశాల్లోనూ విచారించాల్సి ఉందన్న సీపీ యోగానంద్ సీఐడీ ఆర్థిక నేరాల విభాగానికి ఈ కేసును బదలాయించినట్లు తెలిపారు. తండ్రి, బంధువులతో కలిసి మొత్తం 12 బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి 30 బ్యాంకు ఖాతాల ద్వారా హవాలా దందా నడిపిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సీపీ యోగానంద్ తెలిపారు. అంతేగాక ఈ కేసులో ముగ్గురు వ్యాపారులు ఎక్సైజ్ డ్యూటీ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్న సీపీ ఈ కేసుపై ఇంకా విచారణ జరపాల్సి ఉందని స్పష్టంచేశారు.

మహేశ్‌ను మీడియా ముందు ప్రవేశ పెట్టిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఈ నెల 29వరకు రిమాండ్ విధించారు. మహేష్‌ను ఆదివారం అతని సొంత గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం పరిసరాల్లో అరెస్ట్‌ చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుత కేసును వైజాగ్‌ సిఐడి రీజనల్‌ అధికారి, అడిషనల్‌ ఎస్‌పి నాగేశ్వరరావుకు అప్పగించే అవకాశాలు న్నాయి. ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ ఎవరన్నది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం ఈ వ్యవహారం 680.94 కోట్ల రూపాయల్లో 569.93కోట్లు ప్రపంచంలోని హాంగ్‌కాంగ్‌, చైనా, సింగపూర్‌ తదితర దేశాలకు సాఫ్ట్‌వేర్‌ మెటీరియల్‌ కొనుగోలు కోసమంటూ ఇండియా నుంచి బోగస్‌ డాక్యుమెంట్లతో తరలించి బ్లాక్‌ను వైట్‌ చేసుకునేందుకు యత్నించారు. ఈ వ్యవహారంలోనే ఫారిన్‌ రెగ్యులేషన్‌ ఎక్స్ఛేంజ్‌ యాక్ట్‌ (ఫెరా) చట్టాన్ని ప్రయోగించి పలు దేశాల్లో ఈ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక పోలీస్‌ బృందాలను విశాఖ నుంచి పంపించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.