సత్యంబాబు నిర్దోషి : హైకోర్టు సంచలన తీర్పు

HC Sensational Orders On Ayesha Meera Case Satyam Babu Awarded Rs1 Lakh Compensation

HC Sensational Orders On Ayesha Meera Case Satyam Babu Awarded Rs1 Lakh Compensation

హైదరాబాద్: పదేళ్ళ క్రితం విజయవాడలో దారుణ హత్యకు గురైన ఆయేషా మీరా కేసులో హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టు 2008లో అరెస్ట్ చేసిన సత్యంబాబుని నిర్దోషిగా నిర్ణయిస్తూ తీర్పు చెప్పింది. సరైన ఆధారాలు లేకుండానే సత్యంబాబుని నిందితుడిగా చేర్చారని ప్రాసిక్యూషన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎనిమిదేళ్ళుగా సత్యంబాబుని జైలులో ఉంచారని పోలీసులని మందలించింది.అదేవిధంగా  సత్యం బాబుకు లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

ఇబ్రహీంపట్నం శ్రీ దుర్గ హాస్టల్ లో ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా 2007 డిసెంబర్ 26న హత్యకు గురైంది.  ఆయేషాపై  కొందరు వ్యక్తులు హాస్టల్ రూమ్‌లోకి దూరి అత్యాచారం చేసి హత్య చేశారు. బాత్రూమ్ గదిలో రక్తపు మడుగులో తీవ్ర గాయాలతో ఆమె మృతదేహం లభ్యమైంది. విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హత్య సంచలనం సృష్టించింది. ఈ హత్యకు సంబంధించి సత్యంబాబుకి సంబంధం ఉందంటూ ఆగస్టు 2008లో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. దాదాపుగా 8 సంవత్సరాలుగా సత్యంబాబు జైలు జీవితం అనుభవిస్తున్నాడు. తన కుమారుడైన అక్రమంగా ఇరికించారని గతం లో కొందరు అధికారులపై సత్యం బాబు తల్లి ఆరోపణ చేసింది. 8 సంవత్సరాలుగా అనేక మలుపులు తిరిగిన అయేషా కేసు చివరకు హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా తీర్పు చెప్పింది.

సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై అయేషా తల్లి శంషాద్ బేగం హర్షం వ్యక్తం చేసింది. చివరకు న్యాయమే గెలిచిందని, న్యాయ వ్యవస్థ మంచి తీర్పునిచ్చిందని ఆమె పేర్కొంది. సత్యంబాబుకు పోలీసులు కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని శంషాద్ బేగం కోరింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.