వి4 మూవీస్ లో ‘ఆది’ కి బంప‌ర్ ఆఫ‌ర్‌

Aadi new movie with v4 movies banner
Aadi new movie with v4 movies banner
రెండు మూడు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు క‌ల‌సి లిమిటెడ్ బ‌డ్జెట్ లో మంచి అభిరుచి వున్న చిత్రాలు నిర్మించే సాంప్ర‌దాయం బాలీవుడ్ లో ఇటివ‌ల కాలంలో మెద‌ల‌య్యింది.  ఈ సాంప్ర‌దాయాన్ని మ‌న టాలీవుడ్ లో కూడా మొద‌లు పెట్టారు.
అగ్ర నిర్మాణ సంస్థ  తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో సుస్ధుర స్ధానం సంపాయించిన గీతాఆర్ట్స్ , వ‌రుస విజ‌యాల‌తో క్రేజి నిర్మాణ సంస్థ గా పేరుగాంచిన నిర్మాణ సంస్థ యు.వి.క్రియోష‌న్స్ , త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఏక‌కాలంలో విజ‌యాలు సాదించి అగ్ర‌నిర్మాణ సంస్ధ గా నిలిచిన స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్ధ‌లు క‌ల‌సి వి4 మూవీస్ బ్యాన‌ర్ మెద‌లు పెట్టారు. దీనిలో క్వాలిటి గుడ్ ఫిల్మ్స్ నిర్మించే విధంగా ప్లానింగ్ వేసుకున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ న‌టుడు ద‌ర్శ‌కుడు ఈటివి ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మెద‌టి చిత్రానికి శ్రీకారం చుట్టారు.
సౌత్ ఇండియాలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ గా ప్రారంభమైన వి4 మూవీస్ బ్యాన‌ర్ లో న‌టించే అవ‌కాశం ఎవ‌రు సొంతం చేసుకుంటారా అని టాలీవుడ్ ప్రేక్ష‌కులు ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు వేసుకుంటున్న స‌మ‌యంలో ప్ర‌ముఖ న‌టుడు సాయికుమార్ కుమారుడు హ‌ీరో ఆది ఆ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేశాడు. టాలీవుడ్ లో మాక్సిమ‌మ్ స‌క్స‌స్ రేట్ వున్న నిర్మాతలు  క‌ల‌సి ఈ చిత్ర నిర్మాణ భాద్య‌తలు స‌క్స‌స్‌ఫుల్ నిర్మాత బ‌న్నివాసు కి అప్ప‌గించారు.
ఇప్ప‌టికే బ‌న్నివాసు నిర్మాత‌గా 100% ల‌వ్, పిల్లా నువ్వులేని జీవితం, భ‌లేభ‌లేమ‌గాడివోయ్ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌తో 100% స‌క్స‌స్ రేట్ తో దూసుకుపోతున్నారు. ఇలాంటి సినిదిగ్గ‌జాలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం ఆది కి బంప‌ర్ ఆఫ‌ర్ అనే చెప్పాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.