జీవితంలో డ్రగ్స్ చూడలేదు: నందు

Hero Nandu denies the allegations in drugs case notice

డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌లో సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న ఒక్కరొక్కరి పేర్లు బయటికి వస్తుండడంతో తమ సంజాయిషీ ఇచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. పదిమందికి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కొన్ని పేర్లు ఈరోజు ఉదయం నుండి మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే డ్రగ్స్‌ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని హీరో నందు చెబుతున్నాడు.

Hero Nandu denies the allegations in drugs case notice

అంతేగాక అధికారుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని, తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదని స్పష్టంచేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ కేసుతో తనకు  ఎలాంటి సంబంధం లేదన్న నందు ఏ పరీక్షకైనా తాను సిద్ధమని, డ్రగ్‌ కేసులో తనను ఇరికించే ఉద్దేశంతోనే ఇదంతా చేసివుంటారన్న అనుమానాన్ని బయటపెడుతున్నాడు. వీటికితోడు తను జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్‌ చూడలేదని, అలాంటిది మీడియాలో తన పేరు కూడా రావడం ఆశ్చర్యపోయానని అంటున్నాడు.

See Also: డర్టీ పిక్చర్ : డ్రగ్స్ కేసులో బయటపడుతున్నమేకప్

మరోవైపు డ్రగ్స్‌ కేసులో తన పేరు బయటపెట్టడం బాధగా ఉందని ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా అంటున్నారు. టీవీల్లో తన పేరు చూసి షాక్‌ అయ్యానని, డ్రగ్స్‌ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని చెప్పుకొచ్చారు. అసలు తనకు ఎలాంటి అలవాట్లు లేవని, ఆఖరికి సిగరెట్ తాగే అలవాటు కూడా లేదని స్పష్టంచేశారు. డ్రగ్స్‌ విషయంలో తనపై వస్తున్న వార్తలు అవాస్తవమన్న చిన్నా మీడియాలో వస్తున్నట్లు అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు.

See Also: నోటీసులు వచ్చిన మాట నిజమే – నేనేం తప్పు చేయలేదు

Have something to add? Share it in the comments

Your email address will not be published.