త్వరలో ‘ఇంతలోఎన్నెన్ని వింతలో’ టీజర్

Inthalo Ennenni Vinthalo Teaser will be out soon
Inthalo Ennenni Vinthalo Teaser will be out soon
 హరి హర చలన చిత్ర పతాకం పై హ్యాపెనింగ్ యంగ్ హీరో నందు  హీరోగా, సౌమ్య హీరోయిన్‌గా, స్వామిరారా ఫేమ్ పూజా రామచంద్రన్ కీలక పాత్రలోనూతన దర్శకుడు వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో  సామంతుల శ్రీకాంత్ రెడ్డి , ఇప్పిలి రామ మోహన రావు నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న నూతన చిత్రం “ఇంతలోఎన్నెన్ని వింతలో”.
దర్శకుడు మాట్లాడుతూ హీరో, ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకొనే తరుణంలో స్నేహితుడు చేసిన చిన్న పొరపాటు ఎటువంటి పరిణామాలకు దారితీసిందో అన్న పాయింట్ ను అత్యంత ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించిన చిత్రం “ఇంతలోఎన్నెన్ని వింతలో”. నిర్మాణంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటున్న ఈచిత్రం టీజర్ ను జూన్ మొదటి వారంలో ప్రముఖ హీరో చేతుల మీదుగా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈచిత్రానికి కెమెరా: ఎస్ మురళి మోహన్ రెడ్డి, ఎడిటర్: చోటా కె ప్రసాద్, ఆర్ట్: జిల్లా మోహన్, సాహిత్యం: సురేష్ ఉపాధ్యాయ, సంగీతం: యాజమాన్య, సహ నిర్మాత: డి.శ్రీనివాస్ ఓంకార్, నిర్మాతలు: సామంతుల శ్రీకాంత్ రెడ్డి , ఇప్పిలి రామ మోహన రావు,దర్శకత్వం: వర ప్రసాద్ వరికూటి

Have something to add? Share it in the comments

Your email address will not be published.