ప్రభాస్ ‘ఆ సీన్’ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డాడట..!

Hero Prabhas embarrassed for two days to do a scene in Bahubabi directed by Rajamouli

Hero Prabhas embarrassed for two days to do a scene in Bahubabi directed by Rajamouli

తెలుగు చలనచిత్ర పరిశ్రమకేకాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమే గర్వపడేలా తెరకెక్కిన సినిమా బాహుబలి. అలాంటి అపురూప దృశ్యరూపంలో నటించే అవకాశం రావడం కూడా నిజంగా గొప్పే. అందులోనూ టైటిల్ పాత్ర పోషించడం అంటే ఎంత హ్యాపీగా ఫీలవుతారో వేరే చెప్పాల్సిన అవసరంలేదు.

హీరో ప్రభాస్ కూడా అంతే హ్యాపీగా ఉన్నాడు. అందులోనూ బాహుబలి2 విడుదలకు దగ్గరపడడంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో చేసే ప్రతీ సీన్ జీవితంలో ఒక మరుపురాని అనుభూతిని మిగుల్చుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. బాహుబలి సినిమా రిలీజ్ అయి ఇన్నేళ్ళవుతున్నా ఆ సినిమాోని ప్రతీ సీన్ అందరి కళ్ళ ముందూ కనబడుతూ ఉంటాయి. అందులోనూ  ఈ సినిమాలో కొన్నిసీన్ల గురించయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

బాహుబలి మొదటిభాగంలో అందులోనూ రాజమౌళి సృష్టించిన అద్భుత దృశ్య రూపంలో నటించడం గొప్ప అవకాశంగా ఫీలవుతున్నాడట ప్రభాస్. బాహుబలి2 తమిళం వెర్షన్ ఆడియో రిలీజ్ సందర్భంగా చెన్నైకి వెళ్ళిన ప్రభాస్ చెన్నైతో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చకున్నాడు. తను తమిళనాడులోనే పుట్టానని, ఏదో ఒకరోజు నేరుగా తమిళ చిత్రంలో నటిస్తానని చెప్పుకొచ్చాడు మన బాహుబలి.

అయితే బాహుబలి సినిమాలో అందరికీ గుర్తుండిపోయే ఓ సీన్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిపడ్డానని చెప్పుకొచ్చాడు. పెద్దస్టార్‌ అయిన సత్యరాజ్‌ తన కాలును తలపై పెట్టుకునే సీన్  చేయడానికి రెండు రోజులపాటు ఇబ్బంది పడ్డానని, అయితే రాజమౌళి సహాయంతో ఆ సీన్ పూర్తి చేశానని గతాన్ని గుర్తుచేసుకున్నాడు ప్రభాస్.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.