రవితేజ ఎందుకలా చేశాడు??

Hero Raviteja skpis his brother Actor Bharath funeral Why?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరి బ్యాగ్రౌండ్‌లేకుండా తన కష్టంతో ఇష్టమైన ఫీల్డ్‌లోనే ఉంటూ ఎన్నో రాత్రులు శ్రమించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు రవితేజ. అతను హీరోగా ఎదిగిన తర్వాత తన తమ్ముళ్ళు ఇద్దరు భరత్, రఘులను ఇద్దరినీ ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళకేవైనా ఇబ్బందులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్న అన్నయ్య, యాక్సిడెంట్‌లో చనిపోయిన తమ్ముడి చివరి చూపుకు నోచుకోలేని పరిస్థితికి వచ్చాడు.

Hero Raviteja skpis his brother Actor Bharath funeral Why?

ఇన్నేళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్న తమ్ముడి భౌతిక కాయాన్ని చూడడానికి రవితేజ కానీ, అతని కుటుంబసభ్యులు ఎవరూ కానీ రాని విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు కారణం ఏంటి??

See Also: నిజం ఇప్పుడైనా బయటికొస్తుందా??

నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన హీరో రవితేజ తమ్ముడు సినీ నటుడు భరత్ అంత్యక్రియలు మహాప్రస్థానం స్మశానవాటికలో జరిగాయి. అయితే స్మశానవాటికకు చనిపోయిన తమ్ముడి చివరి చూపు చూడటానికి రవితేజగానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ రాకపోవడం, కనీసం అంత్యక్రియల్లో పాల్గొనలేదు. మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియల్లో రవితేజ మరో సోదరుడు రఘు, కొందరు స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు.

See Also: ప్రాణం తీసిన అతివేగం – మద్యం

30ఏళ్లుగా తమ్ముడు భరత్‌తో ఉన్న అనుబంధాన్ని రవితేజ గుర్తు చేసుకుంటూ..భౌతికకాయాన్ని కూడా చూడలేనని అన్నారు. కుటుంబసభ్యులందరూ శోకసంద్రంలో ఉన్నారు. అంత్యక్రియలకు ఎవరూ రాలేకపోతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటూ రవితేజ మీడియాకు, మిత్రులకు చెప్పారు. తమ్ముడు భౌతిక కాయాన్ని చివరి చూపు కూడా చూడలేనని రవితేజ చెప్పారు. భరత్ భౌతికకాయాన్ని చూడడానికి ఆయన తల్లి కూడా ఇష్టపడలేదు. దాంతో కుటుంబసభ్యులు ఎవరూ లేకుండానే భరత్ అంత్యక్రియలు జరిగాయి.

కంటికి రెప్పలా కాపాడుకున్న తమ్ముడు హఠాన్మరణం రవితేజతోపాటు ఆయన కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

See Also: ‘యమపురి’కి ఎంట్రెన్స్‌గా మారిన ఔటర్ రింగ్‌రోడ్డు

Have something to add? Share it in the comments

Your email address will not be published.