ప్రాణం తీసిన అతివేగం – మద్యం

Hero Raviteja Brother Bharath died in a Accident on Outer Ring Road

మద్యం సేవించి వాహనం నడపకండి… ప్రాణాలపైకి తెచ్చుకోకండి అని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టి మృత్యు కుహరంలోకి వెళ్ళేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అందులోనూ యమపురికి ఎంట్రెన్స్‌గా మారిన నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డుపై అతివేగం ప్రమాదకరమని, ఇటీవల మంత్రి నారాయణ కుమారుడు చనిపోయిన తర్వాత ఓఆర్ఆ‌ర్‌పై వేగాన్ని కూడా అత్యధికంగా వంద కిలీమీటర్లకు తగ్గించినప్పటికీ మృత్యువాత పడేవారి సంఖ్య నమోదవుతోంది.

Hero Raviteja Brother Bharath died in a Accident on Outer Ring Road

తాజాగా సినీనటుడు రవితేజ సోదరుడు భరత్‌ రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. శనివారం రాత్రి 10గంటల సమయంలో శంషాబాద్‌ మండలం కొత్వాలగూడ సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్‌పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని నోవాటెల్‌లో పార్టీకి హాజరైన భరత్ తిరుగుప్రయాణంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై పక్కన పార్క్  చేసుకొని ఉన్న లారీని వెనకనుండి ఢీకొట్టడంతో ఎయిర్‌బ్యాగులు తెరుచుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. పార్టీలో భరత్ మద్యం సేవించారని, మద్యం మత్తులో అతివేగంతో కారును నడపడం వల్ల రోడ్డు పక్కన ఆగిఉన్న లారీ కనిపించకపోవడం వల్లే ఢీకొట్టారని పోలీసులు చెబుతున్నారు.

See Also: ‘యమపురి’కి ఎంట్రెన్స్‌గా మారిన ఔటర్ రింగ్‌రోడ్డు

ప్రమాదానికి గురైన కారు రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పేరుతో ఉంది. లారీని ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జు అయి భరత్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్ అయిన తర్వాత సుమారు 40 నిమిషాల తర్వాత అటువైపు నుండి వెళ్తున్న ఓ వాహనం యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఆగిచూసేసరికి భరత్ ప్రాణాలతోలేరని చెబుతున్నారు. అంతేగాక ఓఆర్‌ఆర్‌పై ఈమధ్య కాలంలో జరుగుతున్న యాక్సిడెంట్లలో ఎక్కువగా రోడ్డు పక్కన వాహనాలను ఆపిఉంచడం వల్ల జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఓఆర్ఆర్‌పై వాహనాలను ఆపడం నిషేదం అని తెలిసినప్పటికీ చాలామంది లారీ డ్రైవర్లు పక్కన పార్క్ చేయడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

రాత్రి ఘటన జరిగితే ఉదయం వరకు ఎవరికీ ఈ యాక్సిడెంట్ జరిగిన విషయం తెలియక పోవడంతో ఈరోజు ఉదయం భరత్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.