బండ్ల గణేష్ ‘కుక్క కాదు తోడేలు’ అంటున్న హీరో

Hero Sachin Joshi fires on Producer Bandla Ganesh

Hero Sachin Joshi fires on Producer Bandla Ganesh

 

టాలీవుడ్ పెద్ద నిర్మాతల్లో ఒకరైన బండ్ల గణేష్, బాలీవుడ్ హీరో సచిన్ జోషిల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే పలుసార్లు ట్విట్టర్ వేదికగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. హిందీలో సూపర్ హిట్ అయిన “అశికీ-2″ను తెలుగులో “నీజతగా నేనుండాలి” గా రీమేక్ చేశారు. ఈ సినిమా అప్తోపుడు మొదలైన గొడవలు రోజు రోజుకి పెద్దదౌతున్నాయి.

లేటెస్ట్‌గా తాతినేని సత్య దర్శకత్వంలో సచిన్‌జోషి హీరోగా ఈశాగుప్తా హీరోయిన్‌గా తెరకెక్కిన ‘వీడెవడు’ చిత్రం టీజర్‌ను ఈ రోజు హైద్రాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధాలు ఇచ్చిన సచిన్ బండ్ల గణేష్ విషయంలో కాస్త ఘాటుగానే స్పందించాడు. బండ్ల గణేష్ పెద్ద ఇడియట్ అన్న సచిన్ అంతటితో ఆగకుండా బండ్ల గణేష్‌కు నేనెవరో తెలియదని ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పినట్లు చూశానని, అతని వ్యక్తిత్తం ఎలాంటిదో ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికీ తెలుసని చురకలంటిచాడు సచిన్.

అంతేగాక కుక్క విశ్వాసం ఉన్న పెంపుడుజంతువు కాబట్టి బండ్ల గణేష్‌ను కుక్కతో పోల్చలేమని, అతని వ్యక్తిత్వం తోడేలులాగా ఉంటుందని మండిపడ్డాడు సచిన్. ఇప్పటికే గణేష్‌పై 14 చెక్ బౌన్స్ కేసులున్నాయని, అన్నీ లీగల్ కేసులేనని అన్నారు. అలాగే బండ్ల తండ్రి తన వద్దకు వచ్చి కన్నీరు పెట్టుకోవడంతో అతన్ని జైలుకు పంపంకుండా వదిలానని సచిన్ వ్యాఖ్యానించాడు.

బండ్ల గణేష్‌తో కోర్టు ద్వారానే వ్యవహారం తేల్చుకుందామని అనుకున్నానని, ‘ఒరేయ్ పండు’ సినిమా షూటింగ్ సమయంలో తనకు తినేందుకు తిండి కూడా లేదని బండ్ల గణేశ్ అనేవాడని.. ఆ తర్వాత నమ్మక ద్రోహం చేశాడని మండిపడ్డాడు. బండ్ల గణేశ్ పై కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో తనపై ఆరోపణలు చేయడం తగదని సచిన్ జోషి వ్యాఖ్యానించాడు.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.