విడుదలకు సిద్ధమైన  హీరో శ్రీకాంత్  చిత్రం  ‘రా..రా…’ 

Hero Srikanth latest film Raa raa getting ready to release with high intense devil drama
శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరోగా, నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. జూన్ నెల ప్రథమార్ధం లో విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..’ ఇది హాస్యం తో కూడిన  హర్రర్ ధ్రిల్లర్ చిత్రం.  మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగ టు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. ‘రా..రా ‘చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.
మా హీరో, మిత్రుడు  శ్రీకాంత్ తో రూపొందిస్తున్న ‘రా..రా’  చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవల మెగాస్టార్ విడుదల చేసిన చిత్రం మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన  లభించింది. ఈ నెలలోనే చిత్రం టీజర్ ను ఓ ప్రముఖ కథానాయకుడు చేతులమీదుగా విడుదల చేయనున్నాము. అలాగే చిత్రం ఆడియో వేడుకను విభిన్న రీతిలో జరుపనున్నాము.  అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, వచ్చే నెలలో చిత్రంను  విడుదల  చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.