సినిమా నచ్చకపోతే క్షమించండి అంటున్న హీరో

ఓ సినిమా విడుదైన తర్వాత ఫలితం ఎలా ఉన్నా తమకేమాత్రం సంబంధలేదన్నట్లు ఉండే హీరోలు ఉన్న ఈ రోజుల్లో ఓ యంగ్ హీరో మాత్రం తాను అందరికంటే భిన్నమని చెప్పకనే చెప్పేస్తున్నాడు. పెళ్ళిచూపులు సినిమాతో సక్సెస్ అందుకున్న విజయ్‌దేవరకొండ లేటెస్ట్ మూవీ ద్వారక శుక్రవారం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. కేవలం ప్రేక్షకులనుండి మాత్రమేకాకుండా విమర్శకులనుండి సైతం మంచి క్యారెక్టర్ చేసాడన్న ప్రశంసలు అందుకున్నాడు విజయ్. అయితే ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నా ఈరోజు జరిగిన ద్వారక సినిమా ప్రెస్‌మీట్‌లో ప్రేక్షకులపై తనకున్న గౌరవాన్ని ఒక్కమాటతో చెప్పేశాడు విజయ్.

 

సాధారణంగా సినిమా హిట్ అవ్వకపోయినా హిట్ అయినట్లుగా బిల్డప్ ఇచ్చే ఈ హీరోల కాలంలో విజయ్ మాత్రం ఢిపరెంట్‌గానే తమ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ‘ మేము చేసిన ఈ సినిమా చాలామదికి నచ్చింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు . అయితే కొంతమందికి మా ద్వారక నచ్చలేదని తెలిసింది. వాళ్ళందరికీ క్షమాపణలు చెప్తున్నాను. నాతోపాటు మా టీం మొత్తం ఈ కథను గట్టిగా నమ్మి కష్టపడి ఈ సినిమా తీశాం. అంతేగాక ఓ పది సినిమాలు చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు డిఫరెంట్ సినిమాలు చేశాననే సంతృప్తి కలగాలి. అందుకే ఇప్పటివరకు చేసినవన్నీ అలాంటి సబ్జెక్ట్సే ఎంచుకున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా అందరికీ నచ్చే సినిమాలే చేస్తాను.’

లెజెండ్ సినిమా బ్యానర్‌లో శ్రీనివాస రవీంద్ర దర్శకత్వంలో వచ్చిన ద్వారకలో విజయ్ దేవరకొండకు జంటగా పూజా ఝవేరి నటించింది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.