గ్రూప్ 2 నియామక ప్రక్రియపై స్టే

high-court-stays-telangana-group-2-recruitment-process

గ్రూప్‌ 2 సర్వీసుల విషయంలో తెలంగాణా ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్‌ 2 రాత పరీక్షలకు సంబంధించి ఫలితాలు విడుదలైన తర్వాత ఏర్పడ్డ వివాదం మరో కీలక మలుపు తిరిగింది.

high-court-stays-telangana-group-2-recruitment-process

గ్రూప్‌-2 రాతపరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌‌ను విచారించిన ధర్మాసనం గ్రూప్‌-2 నియామక ప్రక్రియపై హైకోర్టు మూడువారాల పాటు స్టే ఇచ్చింది. ఈ మూడువారాల్లో ఎలాంటి ప్రక్రియ చేపట్టవద్దని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీచేసింది. అంతేగాక మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం 1032 పోస్టులతో ప్రభుత్వం గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ జారీచేసింది. దీనికి సంబంధించి గతేడాది నవంబర్‌లో నిర్వహించిన రాతపరీక్షకు 5లక్షల 65వేలమంది అభ్యర్థులు హాజరయ్యారు. రాత పరీక్ష సమయంలోనే గ్రూప్‌2కి సంబంధించి వివాదం మొదలైంది. అయితే ఈమధ్య ఫలితాలు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ మూడువేల మందికిపైగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానించింది. అంతేగాక ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను చేపట్టింది.

అయితే, డబుల్‌ బబ్లింగ్‌ చేసిన అభ్యర్థులను, వైట్‌నర్‌ ఉపయోగించిన వారు సైతం ఇంటర్వ్యూకు సెలెక్ట్‌ అయ్యారని గ్రూప్‌-2 పరీక్షల్లో పలు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కొన్ని ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలన నిలిపివేయాలని, ఎలాంటి ప్రక్రియ చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.