పార్టీ ఫిరాయింపు మంత్రులకు ఝలక్

Highcourt Serves notices to four Ministers in AP who belongs to YSRCP

గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారానికి తెరలేపిన పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. పార్టీ ఫిరాయించి ఏపీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిని ఆ పదవుల నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది.

Highcourt Serves notices to four Ministers in AP who belongs to YSRCP

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడంపై పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులను అనుభవించడం చట్ట విరుద్ధమంటూ జర్నలిస్ట్‌ శివప్రసాద్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. ఆర్టికల్‌ 164 (1బి) ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులుగా నియమించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ శివప్రసాద్‌ రెడ‍్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

See Also: అచ్చెన్నకు ప్రమోషన్ – ప్రత్తిపాటికి డిమోషన్

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీఫాంపై ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, రావు సుజయ్‌కృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు. అంతేగాక తెలంగాణాలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ టీడీపీ నుంచి గెలిచి తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి చేపట్టారు. దీనిపై విచారించిన హైకోర్టు నలుగురు ఎపి మంత్రులకు నోటీసులు జారీ చేసి, నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతేగాక తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కేసును కూడా ఇదే కేసుతో విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. అంతేగాక తదుపరి విచారణను నాలుగువారాల పాటు వాయిదా వేసింది.

See Also: టార్గెట్ వెంకయ్యనాయుడు: ఏపీలో ఇక వికసించే కమలాన్ని అడ్డుకొనేదెవరు??

Have something to add? Share it in the comments

Your email address will not be published.