నిజాయితే పెట్టుబడి: పవన్ కల్యాణ్

(పాత చిత్రం)

పవన్ ఒక పక్కన సినిమాలు చేస్తూనే మరో పక్కన జనసేన పార్టీ బలోపేతానికి కార్యాచరణను రూపొందిస్తున్నాడు. షూటింగ్ లలో బిజీగా వుంటున్నప్పటికి ప్రజలకు చేరువగానే వున్నాననే భావనను కలిగిస్తున్నాడు. 2019 ఎన్నికల్లో తమ అభ్యర్ధులను నిలబెట్టటానికి అండర్ గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతూనే వుంది. కాగా పవన్ ఊ అంటే జనసేనలో భాగం కావడానికి ఎంతో మంది సెలెబ్రెటీలు కూడా రెడీగా వున్నట్టు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ జనసేన పార్టీని నిలబెట్టటానికి తన సొంత డబ్బును ఖర్చుచేస్తున్నాడని సన్నిహితుల చెబుతున్న మాట. ఇప్పటి వరకు ఆయన పార్టీ కోసం ఎవరినుండి ఎటువంటి ఫండ్ తీసుకోలేదని తెలుస్తోంది. ఏ సభ జరిగినా తన సొంత డబ్బునే ఖర్చు చేస్తున్నాడట. దీంతో పవన్ కల్యాణ్ పై కార్యకర్తలకు మరింత అభిమానం పెరిగిందని తెలుస్తోంది.

పపన్ కల్యాణ్ వ్యూహం ప్రకారం జనసేన పార్టీ నుండి ఎన్నికల్లో నిలబడబోయే అభ్యర్ధులు కూడా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తమ నిజాయితీనే పెట్టుబడిగా పెట్టి ఓట్లు రాబట్టాలని అటువంటి చరిష్మా వున్నవారినే తన పార్టీలోకి తీసుకోవాలని పవన్ వెతుకులాటలో వున్నాడని వినికిడి. ఇందులో భాగంగా ఎటువంటి మచ్చా లేని సెలెబ్రెటీలు కూడా తోడైతే వారి ఫేస్ వాల్యూతో ఖర్చు కూడా పెట్టకుండా  ఓట్లు రాబట్టవచ్చునని పవన్ ఆలోచనలో వుందని అంటున్నారు.

పవన్ కల్యాణ్ భావజాలం తను వెళుతున్న విధానం చూసి కొందరు సినీ, క్రీడా రంగాలకు చెందని వారు తన పార్టీలో చేరడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. తన సిద్దాంతం నలుగురికి చెప్పకనే పవన్ ప్రవర్తనలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తీరు నచ్చే చాలా మంది పవన్ వైపు ఆబగా చూస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటకే పవన్ దృష్టిని ఆకర్షించడానికి చాలా మంది సెలెబ్రెటీలు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల బాట్మెంటన్ క్రీడాకారిని గుత్తా జ్వాలా కూడా పవన్ తో చేతులు కలపడానికి సిద్దంగా వున్నట్టు సంకేతాలు ఇచ్చింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.