రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్ ఫస్ట్ లుక్ లాంచ్

Howra Bridge Movie First look revealed
Howra Bridge Movie First look revealed
ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. విభిన్నమైన కథలతో దూసుకెళ్తున్న రాహుల్ రవీంద్రన్ మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో మనముందుకు వస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ లాంచ్ తో పాటు సినీ విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ… హౌరా బ్రిడ్జ్ అనే టైటిల్ పెట్టడం వెనక పెద్ద రీజన్ ఉంది. కానీ ఇప్పుడు రివీల్ చేయలేం. హ్యూమన్ రిలేషన్స్ కి ఈకథ బ్రిడ్జ్ గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాందినీ చౌదరి ఇందులో చాలా మంచి క్యారెక్టర్లో నటించింది. మనాలీ రాథోడ్ కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. దర్శకుడు  రేవన్ చాలా క్లారిటీతో ఉన్నాడు. అధ్బుతమైన విజువల్స్ మిమ్మల్ని వండర్ చేస్తాయి. రెండు సాంగ్స్ బ్యాలెన్స్ తో కొంత టాకీ పార్ట్ తో చిత్రీకరణ పూర్తవుతుంది. అని అన్నారు.
దర్శకుడు రేవన్ మాట్లాడుతూ… ఇది నా రెండో ప్రాజెక్ట్. బూచమ్మ బూచోడు నాకు చాలా మంచి పేరు తెచ్చింది. రాహుల్ రవీంద్రన్ చాలా మంచి పెర్ ఫార్మర్. ఇది బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ. అందుకే హౌరా బ్రిడ్జ్ అని పెట్టాం. మే మొదటి వారంలో టీజర్ విడుదల చేసి…రెండో వారంలో ఆడియో రీలీజ్ చేసి… నెలాఖరున సినిమాతో మీ ముందుకు వస్తాం. అని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.