ఇవేం పనికిమాలిన హైసొసైటీ చదువులు

Hyderabad Drug racket reveals top schools and colleges students involved

ఒకప్పటి రోజులే బాగుండేవేమో…  టెక్నాలజీ అంతగా విస్తరించనప్పుడు కుటుంబాల్లో పిల్లలకు విలువలు నేర్పించే తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. రాను రాను సమాజంలో వచ్చిన మార్పులతో ఉమ్మడి కుటుంబాలు కాస్తా మైక్రో కుటుంబాలుగా మారి డబ్బు సంపాదనే ధ్యేయంగా కుటుంబాన్ని పట్టించుకోకుండా మొగుడు పెళ్ళాం ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం, తల్లిదండ్రులు వాళ్ళతోపాటు ఉంటే స్టేటస్ సింబల్‌ కాదనుకొని వాళ్ళని ఎప్పుడైతే మన జీవితాల్లోనుండి వదిలించుకున్నామో అప్పుడే అసలు కథ మొదలైపోతోంది. ముసలోళ్ళు మనతో ఉంటే వాళ్ళ చాదస్తం పిల్లలపై రుద్దుతారనే ఒక పనికిమాలిన ఆలోచనతో వాళ్ళను వృద్ధాశ్రమాలకు పంపిస్తూ మన పిల్లల భవిష్యత్తు పతనానికి పునాదులు వేసేస్తున్నాం. ఈమధ్య మెట్రో నగరాల్లో పెరిగిపోయిన డబ్బు యావతో పిల్లలను చదువు చెప్పే స్కూళ్ళలో, కాలేజీల్లో కాకుండా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ, స్టైలిష్‌గా కనిపిస్తూ, అంతా ఏసీ అని ఊదరగొట్టే స్కూళ్ళు కాలేజీల్లో మన పిల్లలను చేర్చకపోతే సొసైటీలో ఎంత నామోషీ అని ఫీల్ అయ్యేవాళ్ళు పెరుగుతుండడంతోనే డ్రగ్స్‌వంటి అనేక సామాజిక రుగ్మతలకు మన చిన్నారులు బానిసలుగా మారుతున్నారు.

Hyderabad Drug racket reveals top schools and colleges students involved

ఇంట్లో మంచి చెప్పే వాళ్ళే లేకపోవడం, అసలు ఇంట్లో తమ పిల్లలు ఏం చదువుతున్నారు?? ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారన్న దానిపై కొంచమైనా తల్లిదండ్రులు ద‌ృష్టిపెట్టకపోవడం వల్లనే చిన్నారుల జీవితాల్లో డ్రగ్స్ రాకెట్లు ద‌ృష్టిపెట్టి వలువలు విప్పేస్తున్నాయి. సమాజంలో టెక్నాలజీ ఎంతపెరిగినా, స్థాయి ఎంత మారినా మన తలరాతలు మర్చేవి మాత్రం విలువలు, మంచి చదువులు. అలాంటి వాటికే మనం పిల్లలను దూరం చేస్తుంటే వాళ్ళకు నచ్చిన దారులు వాళ్ళు వెతుక్కొనే పరిస్థితి వచ్చేస్తుంది.

హైదరాబాద్‌లో ఇటీవల బయటపడ్డ డ్రగ్స్‌ రాకెట్‌లో అనేక కఠోర నిజాలు బయటపడ్డాయి. హైదరాబాద్లోనే అత్యుత్తమమైనవిగా తల్లిదండ్రులు భావించే 19 హైసొసైటీ స్కూల్స్‌,14 టాప్ కాలేజీల్లో సుమారు 1000 మంది విద్యార్థులు డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు.  నైజీరియన్ ముఠాల చేతుల్లో చిక్కి, మత్తుకు బానిసలై విలువైన జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నవారు కొందరైతే.. ఇప్పటికే ఆ మత్తు ఊబిలో కూరుకుపోయినవారు మరికొందరు. నగరంలో మాదకద్రవ్యాల దందా ఏయే స్కూళ్లల్లో, కాలేజీల్లో నడుస్తోందనే విషయమై ఎక్సైజ్ సిట్ అధికారులు తీసిన ఆరా కఠోర వాస్తవాలను బయటపెట్టింది.

See Also: ‘లైఫ్‌ మనకి బోలెడన్ని ఛాన్సులిస్తుంది, మనం లైఫ్‌కి ఒక ఛాన్స్‌ ఇద్దాం’

కేంద్రీయవిద్యాలయ సహా.. అనేక ఇంటర్నేషనల్, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు LSD, MDMA వంటి మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ఈ మేరకు ఆ 19 స్కూళ్ల, 15 కాలేజీల యాజమాన్యాలను సంప్రదించి.. ‘‘మీ విద్యార్థులు మత్తు పదార్థాలను వాడుతున్నట్లు మా విచారణలో తేలింది, దీనిపై మీ స్పందన ఏమిటంటూ ప్రశ్నించారు. అంతేగాక నోటీసులను కూడా పంపించారు అధికారులు. కానీ.. దీనిపై స్కూళ్ల యాజమాన్యాల నుంచి మిశ్రమ స్పందన వచ్చినట్లు సమాచారం. తమ పిల్లలకు అలాంటి అలవాట్లు లేవంటూ కొన్ని యాజమాన్యాలు చెప్పగా… ఇంకా కొన్ని యాజమాన్యాలు మాత్రం తమ పిల్లలను విచారిస్తామని, సరిదిద్దుతామని సమాధానమిచ్చారని టాక్.

డ్రగ్స్‌కు అలవాటైన విద్యార్థులు చదువుతున్న స్కూళ్లు ఇవే

1) జూబ్లీ పబ్లిక్ స్కూల్,
2) ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్,
3) ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్,
4) చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్,
5) అఘాఖాన్ స్కూల్,
6) రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్,
7) గ్లెండేల్ స్కూల్,
8) ఢిల్లీ పబ్లిక్ స్కూల్,
9) భారతీయ విద్యా భవన్,
10) హైదరాబాద్ పబ్లిక్ స్కూల్,
11) నాజర్ స్కూల్,
12) సంఘమిత్ర పబ్లిక్ స్కూల్,
13) శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్,
14) సిల్వర్ ఓక్స్ స్కూల్,
15) కేంద్రీయ విద్యాలయ,
16) అక్షర ఇంటర్నేషనల్ స్కూల్,
17) గీతాంజలి పబ్లిక్ స్కూల్,
18) జాన్సన్ గ్రామర్ స్కూల్,
19) డీఏవీ పబ్లిక్ స్కూల్.

See Also: డ్రగ్ రాకెట్‌లో బయటపడాల్సిన పేర్లు ఎన్నో..??

కాలేజీలు..

1) సీబీఐటీ,
2) నిజాం కాలేజీ,
3) గోకరాజు రంగరాజు,
4) ఎంజీఐటీ,
5) అరోరా కాలేజీ,
6) సెయింట్ మేరీ కాలేజీ,
7) ఏవీ కాలేజీ,
8) శ్రీనిధి కాలేజీ,
9) సెయింట్ జోసెఫ్ కాలేజీ,
10) ఇక్ఫాయి,

11) హైదరాబాద్ బిజినెస్ స్కూల్,
12) భవన్స్ న్యూ సైన్స్ కాలేజీ,
13) సెయింట్ ఫ్రాన్సిస్,
14) విల్లా మేరీ కాలేజీ.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.