‘యమపురి’కి ఎంట్రెన్స్‌గా మారిన ఔటర్ రింగ్‌రోడ్డు

HYDERABAD-OUTER-RING-ROAD-BECOME-ENTRANCE-OF-YAMAPURI-AS-DEATH-TOLLS-INCREASE

HYDERABAD-OUTER-RING-ROAD-BECOME-ENTRANCE-OF-YAMAPURI-AS-DEATH-TOLLS-INCREASE

  • రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఓఆర్‌ఆర్
  • నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులు
  • కేసులు పెడుతున్నా ప్రయాణికుల్లో మార్పు శూన్యం

ఎవరికైనా జీవితంపై విరక్తి కలిగితే ఔటర్ రింగ్‌రోడ్డు ఎక్కితే చాలు ఎక్కడికైనా ‘యమ’ స్పీడ్‌గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం, ఓవర్ స్పీడ్‌, మధ్య మధ్యలో స్పీడ్‌కు తగ్గట్టుగా రోడ్డులేకపోవడంతో ఔటర్‌ రింగ్‌‌రోడ్‌ కాస్తా యమపురికి ఎంట్రెన్స్గా మారింది. దీంతో ఒక్కసారి రింగ్‌రోడ్‌ ఎక్కాక గమ్యస్థానికి చేరుతామా అనేది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్‌కి ఇంటర్నేషనల్ సొబగులు తెచ్చిన ఔటర్ రింగ్‌రోడ్డు నిత్యం ప్రమాదాలతో నెత్తురోడుతోంది.  ముఖ్యంగా పోలీసుల పర్యవేక్షణాలోపం, వాహనాల మితిమీరిన వేగం కలిసి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

158 కిలోమీటర్ల విస్తీరణంలో ఉన్న ఈ ఔటర్‌రింగ్ రోడ్డు ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు వందల ప్రమాదాలు జరిగి అనేక కుటుంబాలను విషాదంలో ముంచేశాయి. ఔటర్‌పై ప్రతి యాక్సిిడెంట్ జరిగిన తర్వాత అప్రమత్తమైయ్యే ట్రాఫిక్ పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తూ కేసులను నమోదు చేసుకుని చేతులుదులుపుకుంటున్నారు. గంటకు 120 కిలోమీటర్ల వేగ పరిమితితో నిర్మించిన ఔటర్‌పై సూచికబోర్డు చూసి అప్రమత్తమయ్యే సరికే.. వాహనం 150 నుంచి 200 మీటర్లు ముందుకు వెళ్లిపోతుంది. ఫలితంగా అయోమయానికి గురవుతున్న వాహనదారులు వేగంగా వెళ్తున్నామన్న విషయాన్ని విస్మరించి అకస్మాత్తుగా వెహికిల్‌ను టర్న్ చేస్తున్నారు. దీంతో అదుపు తప్పి ప్రమాదాల బారినపడుతున్నారు. నిబంధనలు పాటించక పోవడమూ ప్రమాదాలకు మరో కారణం.ట్రాఫిక్‌ను నియంత్రించే భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ రింగ్‌రోడ్‌ ఇలా మృత్యుదారిగా మారడంతో దీనిపై వెళ్లాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు.

లేటెస్ట్‌గా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఔటర్ రింగ్ ఎగ్జిట్ 14 రోడ్డుపై శంషాబాద్ నుండి పెద్ద అంబర్‌పేటవైపు వెళ్తున్న ఎపి16బిబి3888 కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో కారులో ప్నరయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.  మరోవైపు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఎన్‌హెచ్44 బైపాస్ రోడ్డులో ఎంఎస్‌ఎన్ కంపెనీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. సంఘటన స్థలం లో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి లో మృతి చెందాడు.

158 విస్తీరణలో ఉన్న ఓఆర్‌ఆర్‌పై ప్రస్తుతం 133 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించేందుకు అనుమతిస్తున్నారు. ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారుడికి ప్రాధమిక అవగాహన లేకపోడంతో స్పీడులో ఢీకొట్టుకుని ప్రాణాలు వదులుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.