హైదరాబాద్‌లో భారీ దొంగతనం

hyderabad robbery case Robbers loot 45 Tula gold from a Flat in Kukatpally
hyderabad robbery case Robbers loot 45 Tula gold from a Flat in Kukatpally
ఇంటికి తాళం కనిపించిందంటే చాలు చోర కళకు పని చెప్తున్నారు దొంగలు. ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్నిసార్లు సూచించినప్పటికీ దొంగతనాలకు మాత్రం ఏమాత్రం అడ్డుఅుపులేకుండా పోతోంది. హైదరాబాద్ కూకట్‌పల్లి ఈనాడు కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది.
ముక్తా నివాస్‌లోని ఫ్లాట్ నంబర్-403 యజమాని కుటుంబసభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఇదే అదనుగా భావించిన దుండగులు బుధవారం అర్థరాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న దాదాపు 45 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి సామగ్రితో పాటు, ఒక లక్ష నగదును ఎత్తుకెళ్లారు.
గురువారం ఉదయం పరిస్థితి గమనించిన పక్కింటివాళ్ళు బాధితులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.