దేశంలోనే అతిపెద్ద రెండో ‘హ్యుందాయ్ డిజిటల్ షోరూమ్’ ప్రారంభం

HYUNDAI Inaugurates New Dealership and City Store in Hyderabad

హ్యుందాయ్ కార్లకు మంచి ఆదరణ పెరుగుతోందని, ఆయా కార్ల విభాగాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తున్నాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీయీవో వై.కె.కూ అన్నారు. కొనుగోలు దారులకు మరింత సౌకర్యంగా ఉండేలా.. కార్ల వివరాలను డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా తెలియజేయడానికి హ్యుందయ్ డిజిటల్ షోరూమ్ అవుట్ లెట్లను ప్రారంభిస్తోంది.

HYUNDAI Inaugurates New Dealership and City Store in Hyderabad

దేశంలోనే రెండో డిజిటల్ షోరూమ్ ను హైదరాబాద్ లోని కెపీహెచ్ బీ కాలనీలో ప్రారంభించింది. లక్ష్మీ హ్యుందాయ్ ఈ షోరూమ్ ను ఏర్పాటు చేస్తోంది. లక్ష్మీ హ్యుందాయ్ కి చెందిన మరో సాధారణ షోరూమ్ ను కూడా ఎల్.బి.నగర్లో కంపెనీ ఇండియా సీయీవో కూ ప్రారంభించారు. ఇది హ్యుందాయ్ కి 479వ షోరూమ్ అవుతుంది.

2017లో గ్రాండ్ ఐ10, యాక్సెంట్లో కొత్త రకాలను కంపెనీ ప్రవేశపెట్టిందని చెప్పారు. ‘హ్యుందాయ్ కి హైదరాబాద్ ప్రధాన మార్కెట్.. కొత్తగా ప్రారంభించిన షోరూమ్ లు అమ్మకాలను మరింత పటిష్టం చేస్తాయి. ఈ ప్రాంతంలో హ్యుందాయ్ కార్లకు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా కార్లను సరఫరా చేయడానికి దోహదం చేస్తాయన్నారు.

HYUNDAI Inaugurates New Dealership and City Store in Hyderabad

లక్ష్మీ హ్యుందాయ్ సీఎండీ కంభంపాటి రామమోహనరావు మాట్లాడుతూ… డిజిటల్ షోరూమ్ 67,000 చదరపు అడుగులు విస్తరించి ఉందన్నారు. కొత్త షోరూమ్ లలో వేగంగా ఖాతాదారుకు సర్వీసింగ్ సేవలు అందించడానికి సదుపాయాలు ఉన్నాయని వివరించారు. హ్యుందాయ్ మోటార్ కార్ల కొనుగోలుదారులకు లక్ష్మీ హ్యుందాయ్ ఉత్తమ సేవలను అందిస్తోందని సీయీవో వై.కె.కూ అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.