లోకేష్‌కు ఇష్టంలేకపోయినా మీకెందుకయ్యా అంత ఇష్టం??

I am not interested in becoming Minister says Nara Lokesh

I am not interested in becoming Minister says Nara Lokesh

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రత్యేకంగా క్యాబినెట్ మార్పులు చేర్పులు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా, వాళ్ళందరినీ పక్కనబెట్టి లోకేష్‌ను మంత్రి చేయడం వెనక బాగా ఒత్తిడి అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. లోకేష్ చంద్రబాబును బాగా సతాయించి మంత్రి పదవి తెచ్చుకున్నారని అందరూ అనుకుంటున్నారు. అయితే అసలు అలా ఏమాత్రం జరగలేదని బాంబ్ పేల్చారు ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసినప్పటినుండి ఏదో ఒకటి తప్పు మాట్లాడుతూ సోషల్‌మీడియాలో టార్గెట్ అయిన లోకేష్‌ లేటెస్ట్‌గా చెప్పిన మాట వింటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎందుకంత దూల అనుకోవడం మాత్రం ఖాయం.

అది ఏంటంటే తనకు మంత్రి పదవి ఇష్టం లేదని కానీ పార్టీ పెద్దల ఒత్తిడి మేరకే తాను మంత్రిపదవిని తీసుకొన్నానని ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ ,గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి నారాలోకేష్ చెప్పారు. తనకు మంత్రి పదవి చేపట్టాలనే కోరిక అస్సలు ఏమాత్రం లేదన్నారు.అయితే పార్టీ పెద్దలు తనను కూర్చోబెట్టి మంత్రి పదవిని తీసుకోవాలని కోరారని చెబుతున్నారు లోకేష్. అయితే మంత్రిపదవిని చేపట్టడం ద్వారా పార్టీకి ప్రయోజనం కలుగుతోందని పార్టీ పెద్దలు ఒత్తిడి తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందుకే ఈ మేరకు తాను మంత్రిపదవిని తీసుకొన్నట్టు ఆయన చెప్పారు.అయితే గ్రామాలను అభివృద్ది చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టేనని చెప్పారు. అందుకే తనకు గ్రామాలను అభివృద్ది చేసే శాఖను ఇవ్వాలని కోరాను.ఈ కోరిక మేరకు తనకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖను కేటాయించిన విషయాన్ని చెప్పారు.

లోకేష్‌కు ఏమాత్రం ఇష్టంలేనప్పుడు మీరెందుకయ్యా ఆయనని బలవంత చేసి మంత్రిని చేసి అందరికీ టార్గెట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.