విచ్ఛిన్నం కాకుండా కాపాడా… అయినా తొలగించారు

I was removed unceremoniously although I strived to keep TJAC united: pittala ravinder

 

I was removed unceremoniously although I strived to keep TJAC united: pittala ravinderతెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాంపై ఐకాస రెబల్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఐకాస ఆవిర్భావం నుంచి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశానని, కోదండరాం వ్యాఖ్యలు ఉద్యమ స్ఫూర్తిని అవమానిస్తున్నట్లున్నాయని పిట్టల రవీందర్ అన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల పునాదులమీద కోదండరాం ఈ పదవిని అనుభవిస్తున్నారని ఆయన తెలిపారు. ఏకపక్ష నిర్ణయాలతో ఎప్పటికైనా ఎదురుదెబ్బ తప్పదని రవీందర్ వ్యాఖ్యానించారు.

ఐకాసాలో విభేదాల అనంతరం పిట్టల రవిందర్‌ను తొలగిస్తున్నట్లు ఐకాస ప్రకటించింది. తనను కనీసం సంజాయిషీగానీ, వివరణగానీ కోరకుండా ఐకాస కన్వీనర్ పదవి నుంచి ఎలా తొలగిస్తారని పిట్టల రవిందర్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐకాస నుంచి చాలా మంది స్వచ్ఛందంగా వెళ్లిపోతున్నా, తాను ఒంటరిగా కష్టపడి పార్టీని కాపాడినట్లు రవీందర్ పేర్కొన్నారు.  నా మీద ఎంతమంది కుట్రలు చేసినాకూడా అవన్నీ మరచిపోయి తెలంగాణ ప్రజా ఉద్యమం యొక్క ఐక్యతను, స్పూర్తి కొనసాగించాలనే లక్ష్యంతో మాత్రమే ఆ రోజు పనిచేశానన్నారు.  తాను ముందు నిలబడి మీడియాలో గానీ, ఇతర చర్చలలో గానీ తాను ఒక బలమైన గొంతుకగా వినిపించి తెలంగాణ ఐకాస ఆ రోజు విచ్ఛిన్నం కాకుండా కాపాడిన చరిత్ర తనకుందని రవీందర్ ఆవేదన వెలిబుచ్చారు.

మొదట్నుంచీ కిందిస్థాయినుంచి జేఏసీ కోసం కష్టపడ్డ తనను కనీస నిబంధనలు పాటించకుండా తొలగించడం తనను ఎంతో బాధించిందని పిట్టల రవీందర్ అన్నారు. ఇవాళ ఐకాస అంటే ఏక పక్ష నిర్ణయాలతో నడుస్తోందని అదే విధంగా కోదండరామ్ తీరుపట్ల ఐకాసలో ఒక్కరికి కూడా నచ్చట్లేదని పిట్టల తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.