దాయాదుల పోరుకు సిద్ధం: ఉగ్రదాడితో భద్రత కట్టుదిట్టం

icc-champions-trophy-india-vs-pakistan-match-security-tightened-ahead-of-terror-attacks

icc-champions-trophy-india-vs-pakistan-match-security-tightened-ahead-of-terror-attacks

  • భారత్, పాకిస్తాన్‌ల మధ్య 127 వన్డేలు జరిగాయి. భారత్‌ 51 మ్యాచ్‌ల్లో, పాకిస్తాన్‌ 72 మ్యాచ్‌ల్లో గెలిచాయి. నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.
  • చివరిసారి భారత్, పాకిస్తాన్‌ జట్లు ఆస్ట్రేలియాలో జరిగిన 2015 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి. అడిలైడ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 76 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.
  • చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్, పాక్‌ మూడుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. భారత్‌ ఒక మ్యాచ్‌లో నెగ్గి (2013లో), రెండింటిలో (2004, 2009లో) ఓడిపోయింది.

రెండు దేశాల్లో నరాలు తెగే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. చూడడానికి అది క్రికెట్ మ్యాచే కాని ఇదొక యుద్ధమనే చెప్పుకోవాలి. ఆడేది క్రికెట్ అయినప్పటికీ గెలవడమే ప్రధానంగా రెండు దేశాలు సిద్ధమౌతున్నాయి. మ్యాచ్ ఎలా ఆడామన్నది లెక్క కాదు… గెలిచామా లేదా అన్నదే ముఖ్యం. క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయంటే చాలు ప్రపంచవ్యాప్తంగా యమ క్రేజ్ ఉంటుంది.

భారత్‌ చాంపియన్స్‌ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’లో తొలి మ్యాచ్‌లోనే దాయాదిజట్టు పాకిస్తాన్‌తో టీమిండియా సమరశంఖం పూరించడానికి రెడీ అయ్యింది. ఈరోజు మద్యాహ్నం మూడు గంటలకు జరిగే ఈ రసవత్తర మ్యాచ్‌కు ఎడ్జ్‌బాస్టన్‌ మైదానం వేదికైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ శిబిరంలోని విబేధాల నుంచి లబ్ధి పొందాలని పాకిస్తాన్‌ చూస్తోంది. ఐసీసీ ప్రపంచకప్‌లలో దక్కని విజయాల్ని చాంపియన్స్‌ ట్రోఫీలో దక్కించుకున్న పాకిస్తాన్‌ అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో పాక్‌ పేస్‌ అటాకింగ్‌కు, భారత బ్యాటింగ్‌ లైనప్‌కు మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. కానీ ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి.

మరోవైపు లండన్‌లో జరిగిన ఉగ్రదాడితో భారత్‌ పాకిస్తాన్ మ్యాచ్‌కు భద్రతను పెంచారు. ఈరోజు  మ్యాచ్‌ జరుగుతున్న స్టేడియంకు 200 కిలోమీటర్ల దేరంలో ఉగ్రదాడి జరగడంతో అప్రమత్తమైన పోలీసులు భద్రతను పెంచారు.

జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రోహిత్‌ శర్మ, యువరాజ్, ధోని, రహానే, హార్దిక్‌ పాండ్యా, కేదార్‌ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్, ఉమేశ్‌/షమీ/బుమ్రా/అశ్విన్‌.

పాకిస్తాన్‌: సర్ఫరాజ్‌ అహ్మద్‌ (కెప్టెన్‌), అహ్మద్‌ షహజాద్, అజహర్‌ అలీ, షోయబ్‌ మాలిక్, బాబర్‌ ఆజమ్, ఫహీమ్‌ అష్రఫ్, హసన్‌ అలీ, ఇమాద్‌ వసీమ్, షాదాబ్‌ ఖాన్, ఆమిర్, హఫీజ్, రియాజ్‌.

Have something to add? Share it in the comments

Your email address will not be published.