వివాహేతర సంబంధం ఎఫెక్ట్: నడిరోడ్డుపై నరికి చంపిన దుండగులు

illegal affair killed a young man Near Court on Proddutur Main Road
 illegal affair killed a young man Near Court on Proddutur Main Road
కర్నూలు జిల్లాలో వైసీపీ నేత నారాయణరెడ్డి హత్యోదంతం మరిచిపోకముందే వైఎస్సార్ కడప జిల్లాలో మరో ఘాతుకం జరిగింది. గత కొంతకాలంగా ఫ్యాక్షన్ హత్యలకు దూరంగా ఉన్న కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో పట‍్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒక వ‍్యక్తిని ప్రత‍్యర్థులు కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన‍్న కోర్టు దగ్గర మారుతి ప్రసాద్‌‌రెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు కిరాతకంగా వేటకత్తితో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికి చంపారు. చంపిన తర్వాత మళ్ళీ రెండోసారి వెనక్కి వచ్చి కసితీరా నరికి చంపాడు మరో వ్యక్తి.
పోలీసుల కథనం ప్రకారం జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మారుతీరెడ్డి(36) సోదరి అనూరాధ అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. అనురాధకు మారుతీరెడ్డిని చంపిన ఇద్దరు ముద్దాయిలు నరాపురం శ్రీనివాసరెడ్డి(50) రఘునాథ రెడ్డి(43)కు బావమరిది అయిన చంద్రశేఖర్‌రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న చంద్రశేఖర్‌రెడ్డి భార్య నిర్మల, ఆమె కుమారుడు అనురాధ ఇంటికి వెళ్ళి గొడవపడ్డారు. అయితే ఈరోజు ఒక పాత కేసుకి సంబంధించి ఇరు వర్గాలు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అనురాధ సోదరుడు మారుతీరెడ్డిని కాపు కాసి ఇద్దరు నిందితులు కసితీరా నరికి చంపారు.

వివాహేతర సంబంధం ఎఫెక్ట్: నడిరోడ్డుపై నరికి చంపిన దుండగులు

కర్నూలు జిల్లాలో వైసీపీ నేత నారాయణరెడ్డి హత్యోదంతం మరిచిపోకముందే వైఎస్సార్ కడప జిల్లాలో మరో ఘాతుకం జరిగింది. గత కొంతకాలంగా ఫ్యాక్షన్ హత్యలకు దూరంగా ఉన్న కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో పట‍్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒక వ‍్యక్తిని ప్రత‍్యర్థులు కిరాతకంగా కత్తులతో నరికి చంపారు.#ProdduturMurder #brutalmurder #maruthireddy #proddatur #Rayalaseema

Posted by Sakalam on Thursday, May 25, 2017

Have something to add? Share it in the comments

Your email address will not be published.