కంగారు పెట్టిస్తారా లేక కంగారు పడతారా?

India can take revenge to Australia in Banglore test

India can take revenge to Australia in Banglore test

బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా రెండో టెస్టులో మొదటిరోజు భారత్‌ను కంగారుసెట్టించిన కంగారులు రెండోరోజు కాస్త నెమ్మదించారు. రెండో రోజు 40/0 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారులను భారత బౌలర్ అశ్విన్ ఆదిలోనే ఎదురుదెబ్బ కొట్టాడు. ఆసీస్ ఓపెనర్ వార్నర్‌ అశ్విన్ బంతిని అంచనా వేయలేక బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత కొంచంసేపటికి ఆసీస్ కెప్టెన్ స్మిత్ కూడా అవుట్ కావడంతో లంచ్ సమయానికి ఆసీస్ రెండు వికెట్లను కోల్పోయింది. అయితే రెన్‌షా- షాన్ మార్ష్ల ద్వయం ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్ళడంలో సక్సెస్ అయ్యారు.

 

అయితే లంచ్ తర్వాత ఆసీస్ జట్టు రెండో సెషన్‌లో మూడు కీలక వికెట్లను కోల్పోయి కంగారుపడింది. అయినప్పటికీ రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిక్యం దిశగా సాగుతోంది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దాంతో ఆసీస్ కు 48 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ రోజు ఆటలో తొలుత ఆసీస్ తడబడినట్లు కనిపించినప్పటికీ తిరిగి గాడిలో పడింది. ఆసీస్ కోల్పోయిన ఆరు వికెట్లలో జడేజా మూడు వికెట్లు సాధించగా, అశ్విన్, ఉమేశ్ యాదవ్, అశ్విన్ కు చెరో వికెట్ లభించింది. అయితే ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండడం, మొదటి రోజు భారత్‌ను కంగారు పెట్టిన నాథన్ రెండో ఇన్నింగ్స్‌లో ఎలా కంగారు పెట్టిస్తాడన్నది చూడాల్సి ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.