పరిశోధనల్లో ఇంకా వెనకబడే ఉన్నాం: రాష్ట్రపతి ప్రణబ్

India lagging far behind in research and innovation President Pranab Mukharjee at centenary celebrations of the Osmania University

India lagging far behind in research and innovation President Pranab Mukharjee at centenary celebrations of the Osmania University

ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేండ్ల పండుగకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పచ్చజెండా ఊపారు. మూడు రోజులపాటు ఓయూ శతాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా జరుగనున్నాయి. ప్రారంభ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కే చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్ రాజ్యానికి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కొందరు అధికారులు, విద్యావేత్తలు చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తూ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1917 ఏప్రిల్ 26వ తేదీన ఫర్మానా జారీ చేశారు.

ఆ తర్వాత కాకతీయ.. పాలమూరు.. తెలంగాణ ఇలా అన్ని యూనివర్సిటీలకూ ఉస్మానియా యూనివర్సిటీ తల్లి లాంటిది. శాస్త్ర.. విజ్ఞాన రంగాల్లోనూ.. సామాజిక శాస్త్రాల్లోనూ సవ్యసాచిలా అసామాన్య ప్రతిభను ఆవిష్కరించిన ఉస్మానియా స్ఫూర్తితో అన్ని చదువులను కాపాడుకోవడానికి ప్రపంచమంతా వ్యాపించాయి ఉస్మానియా పరిమళాలు.

అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని 1917వ సంవత్సరంలో స్థాపించారు. తొలుత దీనిని అబిడ్స్‌లోని అద్దె భవనంలో ప్రారంభించి అక్కడే తరగతులు నిర్వహించేవారు. నిజాం పరిపాలనా కాలంలో హైదరాబాద్‌లో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజ కుటుంబీకులకు.. సంపన్నవర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశ్యంతో బ్రిటీష్ ప్రభుత్వం 1913లో తమ పాలనలో ఉన్న ప్రాంతాలనేగాక సంస్థానాలలో కూడా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని తీర్మానించింది. ఆ విధంగా పాట్నా, బనారస్, మైసూర్, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆసఫ్‌జా VII చే 1918లో స్థాపించబడింది.

ఓయూ శతాబ్ది వేడుకలను ప్రారంభించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక ప్రసంగం చేశారు. ఓయూ ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. వందేళ్ల క్రితం ఇదే రోజు ఒక విజన్‌తో ఓయూ ప్రారంభమైందన్నారు. ఈ వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. రాష్ట్రంలోనూ అనేక మార్పులు చూశానని తెలిపారు. వందేళ్ల క్రితం ఓయూను మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ముందుచూపుతోనే నాడు ఓయూను ప్రారంభించారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ అత్యున్నత విశ్వవిద్యాలయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మెచ్చుకున్నారు.

అంతేగాక మనదేశంలో పరిశోధనలు చేపట్టడంలో, వినూత్న ఆవిష్కరణల్లో వెనుకబడి ఉన్నామన్న రాష్ట్రపతి  పరిశోధన రంగంలో ఇంకా చాలా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. వీటికితోడు మేధావుల ఆలోచనలకు విశ్వవిద్యాలయాలు వేదికలుగా నిలుస్తున్నాయన్నారు. ప్రస్తుతం మనదేశంలో ఐఐటీల్లో దాదాపు క్యాంపస్ ఎంపికలు జరుగుతున్నాయన్న రాష్ట్రపతి ముఖ్యంగా పాత ఐఐటీల్లో 100 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు.

ఉన్నత విద్యలో ఓయూ ఇప్పటికే అభివృద్ధి చెందిందని చెప్పిన ప్రణబ్ ఉన్నత విద్యలో వందల ఏళ్ల క్రితమే ప్రపంచంలో భారతదేశం ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రపంచం నలుమూలల నుండి ఎంతోమంది వచ్చి తక్షశిల, సోమశిల వంటి అనేక విశ్వవిద్యాలయాల్లో చదువుకొనేవాళ్ళని గుర్తు చేశఆరు. అప్పటినుండి ఇప్పటివరకు ఉన్నత విద్యలో ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించామన్నారు.  అయితే ఉన్నత విద్యలో ఇంకా విప్లవాత్మక మార్పులు వస్తాయనటంలో అతిశయోక్తి  ఏమాత్రం లేదన్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

Have something to add? Share it in the comments

Your email address will not be published.