మ్యాచ్ మనదే…. సిరీస్ మనదే….

India Win 4th Test To Clinch Series 2-1, Reclaim Border-Gavaskar Trophy

India Win 4th Test To Clinch Series 2-1, Reclaim Border-Gavaskar Trophy

 

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా  స్వదేశంలో తమకు ఎదురులేదని నిరూపించింది. స్వదేశంలో వరుసగా ఏడో సిరీస్‌ దక్కించుకుని చరిత్ర సృష్టించింది. 2015 నుంచి స్వదేశంలో 25 టెస్టులు ఆడిన టీమిండియా  21 మ్యాచులు గెలిచి విజయ ఢంకా మోగించింది. ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీకి బదులుగా కెప్టెన్‌గా వ్యవహరించిన అజింక్య రహానేకి ఇది తొలి విజయం.

నిర్ణయాత్మక చివరి టెస్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో భారత్‌ కంగారూలను బెంబేలెత్తించింది. తొలి రోజు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 300 రన్స్‌కే కట్టడి చేసింది. కోహ్లీ స్థానంలో టీంలో స్థానం దక్కించుకున్న కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో అద్భుతంగా రాణించాడు.

భారీ స్కోరు సాధించే దిశగా ఉన్న ఆసీస్‌ ఆశలకు కుల్‌దీప్‌ కళ్లెం వేయడంతో భారత బ్యాట్స్‌మెన్లకు తొలి ఇన్నింగ్స్ ఆడడం ఈజీ అయ్యింది. అంతేగాక బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 32పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆసీస్‌ను భారత బౌలర్లు మొదట్లోనే కోలుకోనివ్వలేదు.  ఆసీస్‌ ఓపెనర్లను ఉమేశ్‌ యాదవ్‌ దెబ్బతీశాడు. ఉమేశ్‌ యాదవ్‌, జడేజా, అశ్విన్‌ తలో మూడు వికెట్లు తీసుకోవడంతో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో 106 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది.

విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిర్ణయాత్మక చివరి టెస్టులో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించి మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను ఎగరేసుకెళ్ళింది టీం ఇండియా.

 

ఈ క్రమంలో సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత ఆటగాడు రవీంద్ర జడేజా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అందుకున్నాడు. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శన చేసిన జడేజా.. 25వికెట్లతో పాటు 127 పరుగులు సాధించాడు.

బాల్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించిన జడేజా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు. చివరి టెస్టులో జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి నాలుగు వికెట్లు తీసి 63 పరుగులు చేశాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.