ఎలాంటి పరిస్థితికైనా ఆర్మీ సిద్ధం

Indian-Army-is-ready-to-face-any-circumstances-from-neighboring-countries

Indian-Army-is-ready-to-face-any-circumstances-from-neighboring-countries

దేశ అంతర్గత భద్రతపై ప్రశ్నలులేవనెత్తేలా ఉన్న జమ్మూ కశ్మీర్ విషయంలో కల్లోల పరిస్థితులకు దాయాది దేశం పాకిస్తానే కారణమని ఆర్మీ చెబుతోంది. కశ్మీర్‌లోని యువతను అనవసరంగా దేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడమేకాకుండా, ఆర్మీతో గొడవలకు ఉసిగొల్పుతోందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆరోపించారు. అంతేగాక సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం ద్వారా కశ్మీర్‌ యువతను పాక్‌ రెచ్చగొడుతుందని  అన్నారు. కశ్మీర్‌లో పరిస్థితులు త్వరలోనే చక్కబడుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కశ్మీర్‌లో పరిస్థితిని చక్కదిద్దడానికి భారత్‌ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు రావత్. ఆర్మీ ఆధునికీకరణ అంశాన్ని ప్రభుత్వంతో ప్రస్తావిస్తున్నామని, ఈ విషయంలో పురోగతి బాగుందని తెలిపారు. పాక్‌, చైనా, కశ్మీర్‌ కల్లోల పరిస్థితులను గుర్తుచేస్తూ రెండున్నర యుద్దాలను ఎదుర్కోవడానికి భారత్‌ సన్నద్ధంగా ఉందని రావత్‌ వ్యాఖ్యానించారు.

మరోవైపు.. కశ్మీర్‌లోని నౌగామ్‌ సెక‍్టార్‌లో భారత ఆర్మీ ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని తిప్పికొట్టింది. చొరబాటుదారులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ జవాన్‌ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఉగ్రవాదులను పట్టుకొనేందుకు ఆపరేషన్‌ కొనసాగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.