భారత సైనికుల్లారా.. 2=7 ఎప్పటికీ కాదు.. ఈ ప్రతీకారం సరిపోదు..

Indian Army must hit harder, 7 is just a single digit

Indian Army must hit harder, 7 is just a single digit

ఒక భారత జవాను తలకు 50మంది పాకిస్తానీ సైనికుల తలలు తెగిపడాల్సిందేనని కుండబద్ధలు కొట్టి మరీ చెప్పిన అమర జవాన్ ప్రేమ్‌సాగర్ కుమార్తె మాటల్లో ఎక్కడా అత్యాశ లేదు. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న మనదేశంలో మతకల్లోలాలు సృష్టిస్తూ, తీవ్రవాదులను తయారుచేసి మన దేశంలో అమాయకుల ప్రాణాలు తీస్తూ ఆనందిస్తున్న పాకిస్తానీయులకు మన దెబ్బ ఏంటో తెలియాలంటే ఆ మాత్రం లెక్క ఉంటేనే బాగుంటుంది. అంతర్గత కుమ్ములాటలతో ప్రశాంతత కోల్పోయి పక్కదేశాలపై కుబుద్ధితో దాడులు చేయించే పాకిస్తానీయులకు మన దెబ్బ ఏంటో చూపించాల్సిన సమయం దగ్గరపడింది. కొన్ని నెలల క్రితం చేసిన సర్జికల్ స్ట్రైక్‌ల వంటివి చేస్తేకానీ లెక్క సరిపోదు. మన ప్రతీకారం తీరదేమో…

భారత సైనికులను దుర్మార్గంగా నరికి చంపిన పాకిస్తాన్ ఆర్మీపై ప్రతీకార దాడికి దిగింది భారత సైన్యం. పాక్‌ సైన్యం కిరాతక చర్యకు భారత సైన్యం దీటుగా బదులిస్తోంది. నిన్న ఉదయం జరిగిన సంఘటనతో సరిహద్దు వెంట భారత సైన్యం అప్రమత్తమైంది. పాకిస్తాన్‌ సరిహద్దు సమీపంలోని పాక్‌ స్థావరాలే లక్ష్యంగా పలు చోట్ల భారత సైన్యం విరుచుకుపడింది.

కృష్ణఘాట్‌ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న పాకిస్తాన్‌కు చెందిన కిర్పాన్‌, పింపుల్‌ పోస్టుల్లో రెండు బంకర్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ సంఘటనల్లో మొత్తం ఏడుగురు పాక్‌ సైనికులను మట్టుబెట్టారు మన వీర సైనికులు. దీంతో, జమ్మూకాశ్మీర్‌ వెంట 778 కిలో మీటర్ల మేర ఉన్న సరిహద్దుల్లో పలు చోట్ల కాల్పుల మోతలు వినిపిస్తున్నాయి. ప్రతీకార దాడికి కేంద్రం నుంచి గ్రీన్‌ సిగల్‌ వచ్చినందువల్లే మనోళ్ళు రెచ్చిపోతున్నారని అనుకుంటున్నారు.

మరోవైపు తన తండ్రి మరణానికి ప్రతీకారంగా పాకిస్థాన్‌కు చెందిన 50 మంది సైనికుల తలలు తీసుకురావాలని అమరజవాను ప్రేమ్‌సాగర్‌ కుమార్తె కోరింది.. నియంత్రణ రేఖ వద్ద నిన్న బీఎస్‌ఎఫ్‌ జవాను ప్రేమ్‌సాగర్‌తో పాటు మరో జవానును పాక్‌ సైన్యం అతి కిరాతకంగా తలను మొండెం నుంచి వేరు చేసి హతమార్చిన తర్వాత జవాను స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఆయనకు సైనిక లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

నాలుగు రోజుల క్రితం కూడా ఉగ్రవాదులు తెల్లవారు జామున నాలుగు-నాలుగున్నర గంటల సమయంలో జమ్మూకశ్మీర్లోని కుప్వారాకు 100 కిలోమీటర్ల దూరంలో.. నియంత్రణ రేఖకు కేవలం 10 కిలోమీటర్ల దూరాన పంజ్‌గామ్‌లో ఉన్న ఆర్మీ క్యాంపుపై దొంగదెబ్బ కొట్టారు. ముగ్గురు ఉగ్రవాదులు చేసిన ఈ దాడిలో ఒక తెలుగు జవాను సహా ముగ్గురు సైనికులు అమరులయ్యారు.

ఇలా దాదాపు రోజూ వాస్తవాధీన రేఖ దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మన వాళ్ళు ప్రతిదాడి చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ మన దగ్గర ఉన్న వ్యవస్థ కట్టుబాట్లు మనోళ్ళని ఆపుతున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.