లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌ ఈ హెయిర్ స్టైలిస్ట్..

Indian Barber Ramesh owns a fleet of luxury cars

Indian Barber Ramesh owns a fleet of luxury cars

రోల్స్ రాయస్ కారులో సెలూన్‌కి వెళ్ళి హెయిర్ కటింగ్ చేసే బార్బర్ ఎవరో మీరు తెలుసా.. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి జీవితంలో ఎదగాలనే ఆశతో మంగలిగా జీవితాన్ని ప్రారంభించి తనకు నచ్చిన విధంగా గమ్యాన్ని మార్చుకొని ఇప్పుడు కార్ల రెంటల్ బిజినెస్‌లో దూసుకెళ్తున్న వ్యక్తి బెంగళూరుకు చెందిన రమేశ్. ఇంతలా ఎదగినా తన మూలాలను మరిచిపోకుండా ఇప్పటికీ సెలూన్‌కి వెళ్ళి తన పాత కస్టమర్లకు హెయిర్ కటింగ్ చేస్తూ తన పనిని గౌరవిస్తున్నాడు రమేశ్.

మనసుంటే విజయాన్ని అందుకోవడానికి మార్గం ఇట్టే కనిపిస్తుంది. అంతేగాక ఆ బాటలో నడిస్తే విజయ శిఖరాలను ఎక్కడం చాలా ఈజీ అని నిరూపిస్తున్నారు రమేశ్.  1989లో తండ్రి చనిపోయిన తరువాత కుటుంబ బాధ్యతలను తల్లితోపాటు భుజాలకెత్తుకొని ఇప్పుడు పెద్ద బిజినెస్‌మ్యాన్‌గా అవతారమెత్తారు రమేష్. తండ్రి చనిపోయిన తరువాత కొన్నేళ్ళు తల్లి ఇంటిపనులకు వెళ్ళడం, ఇల్లు గడవడానికి ఆదాయం సరిపోకపోవడంతో పద్నాలుగేళ్ళప్పటినుండే ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్లు, పాలు సప్లై చేసేవాడట. అందుకుగాను రమేశ్‌కు నెలకు 100 రూపాయలు వచ్చేవి. అయితే తండ్రి చనిపోయిన తర్వాత 18ఏళ్ళు వచ్చేవరకు తన అంకుల్ సెలూన్‌ బాధ్యతలు చూసుకొనేవారట. అయితే జీవితంలో ఏదో ఒకటి సాధించాలని చదువులను సైతం పక్కనబెట్టిన రమేశ్ తండ్రి మొదలుపెట్టిన ఇన్నర్ స్పేస్ అనే సెలూన్‌ని నడిపించాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత తన స్కూల్‌కి దగ్గర్లోని తమ సెలూన్‌ని స్టైల్‌కి కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దాడు.

Indian Barber Ramesh owns a fleet of luxury cars

మంగలిగా కెరీర్ ప్రారంభించిన రమేశ్‌కి ఎప్పటినుండో ఒక కారు కొనుక్కోవాలని ఉండేదట. అందుకే 1997లో మారుతి ఓమ్ని కారును కొని అద్దెకు తిప్పడం మొదలుపెట్టాడు. అలా ఆ కారుతో మొదలైన కారు రెంటల్ బిజినెస్ రమేశ్ జీవితానికే టర్నింగ్ పాయింట్‌ అయ్యింది. ఆ తర్వాత రమేశ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించి నెమ్మదిగా 2004లో లగ్జరీ కార్లను కొని రెంటల్ బిజినెస్‌లో లగ్జరీ కార్లను తీసుకొచ్చాడు.

రమేశ్ మొదటి లగ్జరీ కారు 38 లక్షలు విలువచేసే మెర్సిడిజ్ బెంజ్ ఈ క్లాస్. ప్రస్తుతం ఆయన దగ్గర సుమారు 378 కార్లు, వాన్లు, మినీ బస్సులు ఉన్నాయి. అందరిలా కార్ల బిజినెస్ చేయకుండా 2011లో 3.5కోట్ల విలువ చేసే రోల్స్ రాయస్ సిల్వర్ ఘోస్ట్ కారును తన వ్యాపారంలోకి తీసుకొచ్చాడు. అంతేగాక అప్పటినుండి ఇప్పటివరకు 120లగ్జరీకార్లు, మెర్సిడిజ్ సి, ఈ, ఎస్ క్లాస్, బిఎండబ్ల్యూ 5,6,7 సిరీస్ , ఆడి, జాగ్వార్ కార్లు  ఉన్నాయి. ప్రస్తుతం రమేశ్ రోజూ తన దైనందిన కార్యక్రమాలకోసం రోల్స్ రాయస్ కారునే వాడుతుంటారు. తన దగ్గర ఉన్న రోల్స్ రాయస్ కారుని రోజుకి 50వేల చొప్పున అద్దెకు పంపిస్తుంటాడట.

కేవలం కార్లమీద మోజు మాత్రమే కాకుండా రమేశ్ దగ్గర ప్రస్తుతం 16లక్షల విలువచేసే సుజుకి హైఎండ్ బైక్ ఉందట. అంతేగాక కార్ల బిజినెస్ ప్రారంభించినప్పటికీ తన మూలాలను ఏమాత్రం మరిచిపోకుండా తనకు జీవితాన్ని నేర్పించిన మెయిర్ స్టైలింగ్ పనిని ఏమాత్రం మరిచిపోకుండా పాత కస్టమర్ల దగ్గర ఇప్పటికీ 150 రూపాయలు మాత్రమే తీసుకుంటాడట. అతని కస్టమర్లలో బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారితోపాటు ఐశ్వర్యరాయ్‌కి కూడా హెయిర్ స్టైలింగ్ చేస్తుంటాడు రమేశ్.

 

Indian Barber Ramesh owns a fleet of luxury cars

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • Rajitha says:

    Good and inspirational story