రైల్వే బంపర్‌ ఆఫర్..!

indian-railways-introduces-new-rules-from-april1st

indian-railways-introduces-new-rules-from-april1st

ఎప్పుడూ రేట్లు పెంచి ప్రయాణికుల ముక్కుపిండి వసూలుచేసే రైల్వేశాఖ ఇప్పుడు ప్రయాణికులకు బంపర్‌ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా ఒకరైలుకి టికెట్ కొన్న తరువాత దాని తర్వాత స్పీడ్ ట్రైన్స్ ఎక్కడానికి అనుమతి ఉండకపోయేది. ఇప్పుడు ఆ రూల్ నుండి ప్రయాణికులకు మినహాయింపు ఇచ్చింది రైల్వే. ఎక్స్‌ప్రెస్ / మెయిల్‌ రైలు టికెట్‌తోనే రాజధాని, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటును రైల్వేశాఖ ఏప్రిల్‌ ఒకటి నుంచి కల్పిస్తోంది. అందులో భాగంగా ఎక్స్‌ప్రెస్/మెయిల్‌ రైలు కోసం టికెట్‌ రిజర్వేషన్‌ చేయించుకున్న వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణీకులు దాని తర్వాత వచ్చే రాజధాని, శతాబ్ధి రైళ్లలోనూ అదనపు చార్జీలు చెల్లించకుండానే ప్రయాణించే అవకాశాన్ని తీసుకొచ్చింది.

 అంతేగాక రైళ్లలో అందించే టీ, కాఫీ, భోజనం, నీటి బాటిల్‌ ధరల జాబితాను ట్విట్టర్‌లో పెట్టిన రైల్వే శాఖ అధిక ధరలు వసూలు చేసినా, సరకులు నాసిరకంగా ఉన్నా, సేవలు సరిగ్గా లేకున్నా ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇకపై రైళ్లలో రెండు గంటలకు ఓ సారి వంట చేస్తూ ఎప్పటికప్పుడు తాజా భోజనాన్ని వడ్డిస్తారు. దీని కోసం వంటశాల, సరఫరా విభాగాలను వేర్వేరుగా నిర్వహించాలని రైల్వే నిర్ణయించింది. రైళ్లలో రోజూ 11 లక్షల భోజనాలు సరఫరా చేస్తున్నారు. ప్రయాణికులకు ఇక నుంచి టీ  7 రూపాయలకే, మధ్యాహ్న భోజనం 50-55 రూపాయలకే అందిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.