ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్  అడ్డాల  ముఖ్య  అతిథిగా  ఐరిస్ ప్రీ  స్కూల్ 7th వార్షికోత్సవం

IRIS Pre School 7th Anniversary at Kukatpally
IRIS Pre School 7th Anniversary at Kukatpally
కూకట్ పల్లి  ప్రాంతంలో విద్యా రంగంలో మంచి పేరు సంపాదించిన  ఐరిస్ ప్రీ  స్కూల్ 7th వార్షికోత్సవం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి  ప్రముఖ  దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హాజరవ్వడం విశేషం. ఈ కార్యక్రమంలో లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ అధినేత రామాచారి, ప్రముఖ కొరియోగ్రాఫర్ నిక్సన్ మాస్టర్, సంగీత దర్శకుడు జోష్యభట్లతో పాటు… విద్యార్థుల తల్లితండ్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు సందడి చేశాయి. ఈ ప్రోగ్రాంలో రామాచారి  శిష్యులు  అమృత  వర్షిణి, సోని, అఖిల్,  ఆదిత్య,  స్పందనతో పాటు మరికొంతమంది సింగర్స్  పడిన  పాటలు ఆహుతుల్ని  అలరించాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్  నిక్సన్ శిష్యులు చేసిన నృత్యాలు  జోష్  ఫుల్  గా సాగాయి. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు శ్రీకాంత్ అడ్డాల ట్రోఫీలు బహుకరించారు. అక్షర బృందంతో కలిసి స్కూల్ విద్యార్థులు చేసిన డ్యాన్సులు హైలైట్ గా నిలిచాయి.
శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ… స్కూల్ అధినేత ఆశాలత ఆధ్వర్యంలో నడుస్తున్న ఐరిస్ ప్రీ స్కూల్ ఏడవ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. కేవలం చదువు మాత్రమే కాకుండా… ఇతర రంగాల్లోనూ నిష్ణాతులు కావాలంటే ప్రీ స్కూల్ ఏజ్ నుంచే వారికి ట్రైనింగ్ ఇవ్వాలి. అలాంటి విద్యను ఐరిస్ ప్రీ స్కూల్ అదిస్తుండండ విశేషం. కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అని అన్నారు.
ఐరిస్ ప్రీ  స్కూల్ అధినేత్రి  ఆశాలత  మాట్లాడుతూ…. 7వ  వార్షికోత్సవం  జరుపుకోవడం సంతోషంగా  వుంది. నాణ్యమైన  విద్యతో  పాటు మెంటల్  ఎబిలిటీ  ని బిల్డ్  చేయడం  మా స్కూల్ ప్రతేకత. మంచి సినిమాల్ని  రూపొందించే  శ్రీకాంత్ అడ్డాల గారు మా ఫంక్షన్  కి రావడం  చాల హ్యాపీ గా వుంది. విద్యార్థుల్లో ప్రత్యేక నైపుణ్యాల్ని గుర్తించి విద్య అందించడం తమ ప్రత్యేకత అని ఆమె ఈ సందర్భంగా అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.