తెలంగాణా నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు కన్నుమూత

Irrigation Expert R.Vidyasagar Rao passes away at Hyderabad1

Irrigation Expert R.Vidyasagar Rao passes away at Hyderabad1

తెలంగాణాకు టీఎంసీలు, క్యూసెక్కులు గురించి చెప్పిన నీటిపారుద‌ల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు, రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు  విద్యాసాగ‌ర్‌రావు (78) కన్నుమూశారు. ఎక్స్‌టెన్సివ్ మెట‌స్టాటిక్ బ్లాడ‌ర్ క్యాన్సర్‌ వ్యాధితో బాధ‌ప‌డుతున్న విద్యాసాగర్‌రావు ఈరోజు ఉదయం 11గంటల 23నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొని, సాగునీటి విషయంలో రాష్ట్రం ఆవశ్యకత గురించి ఆయన ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఆయన అత్యంత సన్నిహితులు. ఇటీవలే ఆయనను కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించారు.

గత కొంత కాలంగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగానే ఉండటంతో కొన్నాళ్లుగా వెంటిలేటర్ మీద ఉంచి  చికిత్స అందిస్తున్నారు. న‌ల్లగొండ జిల్లాలోని జాజిరెడ్డి గూడెంలో 1939 నవంబర్ 14న జన్మించిన విద్యాసాగర్‌రావు  ఇంజ‌నీరుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ముప్పై ఏళ్ళకు పైగా కేంద్ర జ‌ల‌సంఘంలో ప‌నిచేశారు. అంత‌ర్జాతీయ‌స్థాయిలో జ‌ల‌వ‌న‌రుల‌పై అధ్యయనం చేసిన ఘ‌న‌త విద్యాసాగ‌ర్‌రావుకే సొంతం. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌‌లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించి రిటైరైన విద్యాసాగర్‌‌రావు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ సర్కారు విద్యాసాగర్‌రావుని సాగునీటి ముఖ్య సలహాదారుగా నియమించింది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.