‘ఆ విషయంలో’ చంద్రబాబు తలదూర్చే ధైర్యం చేస్తారా??

Is AP CM Chandrababu Naidu dare enough to reopen that Ayesha meera sesetive case in AP

 

ఆయేషా మీరా హత్యకేసును చంద్రబాబు రీఓపెన్ చేయిస్తారా??

ఆయేషా మీరా హత్య కేసు ఆంధ్రప్రదేశ్‌లో అనేక మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు 8 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించిన పిడతల సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించడం సంచలనమైంది. ఈ కేసులో సత్యంబాబుని ఏ విధంగా విచారణ చేసి నిందితుడిగా చేర్చారనేది హైకోర్టు తీర్పుతో వెల్లడైంది. విషయం బయటకు పొక్కడంతో పోలీసుల తీరుపై ప్రజలకు నమ్మకం పోయింది. సత్యం బాబు కుటుంబం, దళిత సంఘాలు, మానవ హక్కుల సంస్థలు హైకోర్టు సత్యంబాబుని నిర్దోషిగా ప్రకటించడంపై ఆనందోత్సాహాలతో ఉన్నారు. అయితే ఈ కేసులో పోలీసు శాఖ పనితీరుపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తంచేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిపై చర్యలు చేపట్టాలని, ఆ విధంగా పోలీసు శాఖ పనితీరును పెంచుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

సత్యంబాబు తమపై చేసిన ఆరోపణలు నిజం కావని, అన్ని కోణాలలో దర్యాప్తుచేసి ఆధారలతోనే అతనిని నిందితుడుగా నిర్ధారాంచినట్లు పోలీసువ్యవస్థ సమర్ధించుకుంటుంది. సత్యంబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని, వాటిని నిరూపించే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఈ కేసు విచారణలో తమ తప్పులేదని, అంతా శాస్త్రీయభద్ధంగానే విచారణ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమను తాము నిరూపించుకోవడానికి పోలీసు శాఖ సత్యంబాబు విడుదలకు వ్యతిరేకంగా హైకోర్టులో గానీ, సుప్రీంకోర్టులో గాని అప్పీలుకు వెళ్లే యోచన చేస్తున్నారు. సత్యం బాబు విడుదల వ్యతిరేకంగా అప్పీల్ వెళ్ళడానికి పోలీసు శాఖ ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అనుమతిని కోరనున్నారు.

హత్య జరిగిన ప్రదేశం నుండి సేకరించిన ఆధారాలు, అతని మీద జరిపిన మెడికల్ టెస్టులు, అదే విధంగా సత్యంబాబు నేరం చేసినట్లుగా తనకు తాను చెప్పిన వాగ్మూంలాన్ని పోలీసులు అప్పీల్ సమయంలో కోర్టు ముందుంచబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు పెను సవాలుగా మారిన ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్ధోషిత్వంపై ఆ శాఖ అప్పీలుకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు.అప్పీల్‌కు అనుమతి లభించకపోయినా, ఏ సందర్భంలోనైనా సత్యం బాబు నేర నిరూపణ కాకపోతే పోలీసు శాఖ కేసు విచారణ చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్య చేపట్టాల్సి ఉంది.

ఏదిఏమైనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయేషా కేసువిషయంలో అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసును పున:ప్రారంభించి అసలు దోషులను పట్టుకొని శిక్షించాలని ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆయేషా హత్య జరినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ సమయంలో అయేషా కుంటుంబానికి న్యాయం జరగాలని ఆయన చేసిన డిమాండ్ ను పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండి ఆయేషా కుంటుంబానికి న్యాయం చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన విధేయత నిరూపించవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తాను చేసిన వాగ్దానం మేరకు కేసు పునర్విచారణ చేపట్టడానికే యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పున:విచారణ సమయంలో ఈ కేసులో సత్యంబాబు దోషిగా నిరూపించబడితే తన పార్టీకి అదే విధంగా పోలీసు శాఖకు చెడ్డపేరు రాకుండా కాపాడినట్లు అవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఆయేషా హత్య జరిగనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ ఒత్తిడిమేరకే పోలీసులు పనిచేశారనే నిందను వారిపై మోపి పోలీసులను కాపాడేందుకు ప్రయత్నం చేయవచ్చు. బహుశా అందుకేనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసు పునర్విచారణ చేయించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని కూడా కొందరు టిడిపి నాయకులు సమర్ధించినట్లు చెబుతున్నారు. ఆ విధంగానే ముఖ్యమంత్రి కూడా పోలీసు శాఖ అప్పీలు చేసుకోవాడానికి అనుమతులు జారీచేయాలని సలహాకూడా ఇచ్చారని తెలుస్తోంది.

ఇప్పటికే అయేషా మీరా తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వారికి ఏ విధంగా న్యాయం చేస్తారో వేచిచూడాల్సిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.