అగ్రిగోల్డ్ విషయంలో పవన్‌ను పావుగా వాడారా??

Is Chandrababu using Pawan kalyan as Pawn in Agri gold Issue

Is Chandrababu using Pawan kalyan as Pawn in Agri gold Issue

క్యారమ్స్‌లో రెడ్ కాయిన్ వేయడానికి ఒక్కొక్కసారి వేరే కాయిన్‌ను స్ట్రైక్ చేయడం కామన్. రాజకీయాల్లో కూడా ఇదే ఫార్ములా వర్కౌట్ చేస్తున్నారు నాయకులు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించడం సంగతేమో కానీ వాళ్ళను పరామర్శించడంలో ఒకరినొకరు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు దృష్టిలో పెట్టుకొని బాధితులు 18రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేశారు.

అంతేగాక రెండురోజులపాటు అసెంబ్లీలోనూ తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అధికారపక్ష సభ్యులు, విపక్ష సభ్యులు ఒకరిపైన ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. అదే సమయంలో బాధితులకు అండగా వామపక్షాలు నిలబడ్డాయి. అసెంబ్లీలో చర్చ అనంతరం విషయం తీవ్రత తెలిసేసరికి వైసిపి అధినేత జగన్‌ కూడా నిరాహారదీక్ష శిబిరం దగ్గరకు వెళ్లి బాధితులకు అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో బాధితులు కూడా సంబరపడ్డారు. తమవైపు నిలబడడానికి ఓ మనిషి వచ్చాడని సంతోషపడ్డారు..

సుమారు మూడేళ్లుగా అగ్రిగోల్డు బాధితులు రెండు రాష్ట్రాల్లో పోరాటం చేస్తున్నారు. చాలా మంది ఊరువదిలి వెళ్లిపోయారు. అనేక మంది అన్యాయమైపోయారు. 34 లక్షలమంది బాధితులు ఇన్నేళ్లుగా సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నారు. 14వేల కోట్ల రూపాయలు అగ్రిగోల్డు సంస్థ ఎగ్గొట్టింది. దీనిపై బాధితులు, ఎజెంట్లు సంఘంగా ఏర్పడి పోరాటం చేస్తున్నారు.

అగ్రిగోల్డ్ బాధితులను పరామర్శించడానికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా విజయవాడ వచ్చారు. సమావేశంలో బాధితులు చెప్పింది మొత్తం విన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని ఒక్కమాట అనలేదు.  మాట్లాడింది కూడా చాలా ముక్తసరిగానే, వడ్డీలు కట్టడం అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకూ తెలుసు అని అన్నారు. బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించినా, కష్టసుఖాలు ఏకరవు పెట్టినా జనసేన అధినేత కనీసం కనికరించలేదు.

పవన్‌ రంగంలోకి దిగితే పరిస్థితులన్నీ మారిపోతాయి, ప్రభుత్వం కూడా వెంటనే మేల్కొంటుంది అని అందరూ  ఆశలు పెట్టుకున్నారు. అగ్రిగోల్డు బాధితుల సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నారు. కానీ పవన్‌ అగ్రిగోల్డు బాధితుల సమస్యను పరిష్కరించడం అనేది ఆయన చేతుల్లో ఏమీ లేదని అర్థం అయింది. కనీసం ప్రభుత్వం మీద అయినా వత్తిడి తీసుకొచ్చేలా చేసే అవకాశం కూడా ఉండదని తేలిపోయింది. సుదీర్ఘంగా సాగిన పవన్‌ ప్రసంగంలో గుర్తుంచుకోదగిన అంశం, ఆశలు పెంచుకునే విషయం ఏమాత్రం లేకపోవడంతో వివిధ రాష్ట్రాలనుంచి తరలి వచ్చిన బాధితులు  బాధతో వెళ్లాల్సి వచ్చింది.

పవన్‌ కళ్యాణ్‌ అగ్రిగోల్డు బాధితుల్ని పరామర్శించడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతిలో పవన్‌ పావుగా ఉపయోగపడుతున్నాడా? జగన్‌ను దెబ్బతీయడానికి అధికారపక్షం పన్నిన పన్నాగమేనా? అన్న అనుమానాలు జనాల్లో వ్యక్తం అవుతున్నాయి.  అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకోవడం, ఎదుటి పక్షాన్ని దెబ్బతీయడానికే ఇవన్నీ చేస్తున్నారేమో అనే అనుమానాలు వెలుగు చూస్తున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలపై తీవ్రంగా స్పందించే పవన్ అగ్రిగోల్డ్ విషయంలో ఏమాత్రం సీరియస్‌నెస్ చూపించలేదని టాక్ వినిపిస్తోంది. దీనివల్ల జనసేన జనానికి దూరమయ్యే పరిస్థితే తప్ప దగ్గర మాత్రం కాదని భావిస్తున్నారు.

అగ్రిగోల్డు భూముల్ని అప్పనంగా కాజేసే అధికార పక్షం నేతల్ని గానీ, ఉదారంగా వ్యవహరించే ముఖ్యమంత్రిని గానీ, కేసును నీరుగార్చే దిశగా వ్యవహరిస్తోన్న సిఐడిని గానీ ఎవరినీ ఏమీ అనలేదు. అసలు ఎందుకు పవన్‌ కళ్యాణ్‌ వచ్చారు, వెళ్లారు అనేది ఎవరికీ అంతుపట్టడంలేదు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.