గరుడవేగలో భిన్నమైన పాత్రలో పూజాకుమార్‌…

Is Garuda Vega’s Heroin Pooja Kumar a Tamilian?

Is Garuda Vega’s Heroin Pooja Kumar a Tamilian?

న్యూక్లియ‌ర్ సైన్స్ చదువుకున్న గృహిణి పాత్ర‌లో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌తో విశ్వ‌రూపంలో న‌టించి మెప్పించింది హీరోయిన్ పూజా కుమార్‌. పూజా కుమార్ న‌ట‌న‌కు ముగ్ధుడైన క‌మ‌ల్ వెంట‌నే త‌ను న‌టిస్తూ నిర్మించిన ఉత్త‌మ‌విల‌న్‌లో సినిమా హీరోయిన్ పాత్ర‌ను ఆఫ‌ర్ చేశారు. ఆ పాత్ర‌లో కూడా క‌మ‌ల్ కు ధీటుగా న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందారు. నిజానికి పూజా కుమార్ అమెరికాలో పుట్టి పెరిగిన‌ప్ప‌టికీ ఆమె త‌ల్లిదండ్రులు మాత్రం ఇండియా నుండి అమెరికాకు వెళ్ళి అక్క‌డ స్థిర‌ప‌డ్డ త‌మిళులు కావ‌డం గ‌మ‌నార్హం.
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నుండి పూజాకుమార్ కుటుంబం చాలా సంవ‌త్స‌రాలు క్రితం ఆమెరికాకు వ‌ల‌స వెళ్ళారు. అమెరికాలో న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుని న‌టిగా, నిర్మాత‌గా, టెలివిజ‌న్ వ్యాఖ్యాత‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి, క‌థ‌క్‌ల‌లో కూడా ప్రావీణ్యం పొందారు.
వ‌రుస సినిమాలు చేయాల‌ని కాకుండా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లోనే న‌టించడానికి ఆస‌క్తి చూపే పూజా కుమార్ ఇప్పుడు `పిఎస్‌వి గ‌రుడ వేగ 126.18 ఎం` చిత్రంలో డా.రాజ‌శేఖ‌ర్ భార్య‌గా, ఆరేళ్ళ బాబుకి త‌ల్లి స్వాతి రోల్‌లో న‌టిస్తుంది. యాంగ్రీ యంగ్ మేన్ డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`.
రష్య‌న్ స్టంట్ మాన్ డేవిడ్ ఖుబు, థాయిలాండ్ స్టంట్ మాన్ నుంగ్, మరియు ఇండియన్ స్టంట్ మాస్టర్ సతీష్ నేతృత్వం లో, జార్జియా, బ్యాంకాక్, మలేషియా, పట్టాయ, సింగపూర్, ముంబై వంటి ప్రదేశాల్లో యాక్ష‌న్ సీన్స్‌, చేజ్ సీక్వెన్స్‌ల‌ను హాలీవుడ్ యాక్ష‌న్ చిత్రాల‌కు ధీటుగా ఈ సినిమాలో రూపొందిస్తున్నారు. అలాగే బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ విష్ణుదేవా కంపోజిష‌న్‌లో ముంబై లో వేసిన భారి సెట్ లో సన్నీ లియోన్ తో చేసిన ఐటెం సాంగ్ మ‌రో హైలైట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా హైద‌రాబాద్‌లో ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.