ముందస్తుకు నిజంగా సిద్ధమేనా???

Is Pawan kalyan really ready for early polls in two states?

Is Pawan kalyan really ready for early polls in two states?

ఒక పార్టీ ఎన్నికలకు రెడీ అని సంకేతాలిస్తే ప్రజల్లో మేము చాలా బలంగా ఉన్నా… దేనికైనా రెడీ అని చెప్పుకున్నట్లు. అదే అసలు జనాల్లో ఏమాత్రం క్యాడర్‌లేని గట్టి నాయకులు లేని పార్టీలు మేం ముందస్తు ఎన్నికలకు రెడీ అని చెప్తే నవ్విపోతారు. ఇప్పుడు జనసేన విషయంలోనూ అదే జరుగుతోంది. మూడేళ్ళ క్రితం పార్టీ పెట్టి సంస్థాగతంగా పార్టీని బలపరుచుకొనే పని ఏమాత్రం పెట్టుకోకుండా మధ్య మధ్యలో అలా అలా కొన్ని కొన్ని సమస్యలపై పోరాడుతూ, ట్లీట్లు చేేస్తూ రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకుంటున్న జనసేన అధినేత ముందస్తు ఎన్నికలకు రెడీ అని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీకి నిలబడడం అంటే ఏదో సినిమా ఒప్పుకొని షెడ్యూల్ పూర్తిచేసినట్లనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్.

తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కింది. సందట్లో సడేమియా, తానూ రాజకీయాల్లోనే వున్నానన్పించుకోవడానికి ఇదిగో, ‘ముందస్తు ఎన్నికలకు మేం సిద్ధం..’ అన్న ప్రకటన పవన్‌కళ్యాణ్‌ నుంచి రావడంతో మరోసారి చర్చకు దారితీసింది.

సంస్థాగతంగా ఎంతో బలంగా ఉండి, ప్రత్యర్థిపార్టీలను ఎదుర్కోగలిగిన రాజకీయ పార్టీలే ముందస్తు ఎన్నికలకు భయపడి వెనకడుగు వేస్తుంటాయి. అలాంటిది రాజకీయ అనుభవం ఏమాత్రంలేని జనసైన్యానికి ముందుస్తు ఎన్నికలు వస్తే బాగుంటుంనే అభిప్రాయ ఉందట. ముందస్తు ఎన్నికలొచ్చినా, జనసేన సిద్ధమేనంటూ పవన్‌కళ్యాణ్‌ సోషల్‌ మీడియాలో చేసిన ప్రకటన అందర్నీ విస్మయానికి గురిచేసింది. అంతేగాక ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, తెలుగుదేశం పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలని, వైసీపీ నుంచి వచ్చిన వారితో సమన్వయంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రులకు చెప్పిన వేళ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.

పార్టీ ప్రారంభించినప్పటినుండి జనసేన పార్టీ ఇలా లీకుల కార్యక్రమాలతో కాలం వెల్లబుచ్చుతోంది. తనకు సినిమాల్లో ఉన్న అభిమానులంతా జనసేన వెంటే ఉంటారన్న అపోహలో ఉన్న పికె ఇప్పటివరకు సీరియస్‌గా పార్టీ అభివృదధిపై ద‌ష్టిపెట్టడం మానేసి ఇలాంటి కామెంట్స్‌తో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. సంస్థాగతంగా నిర్మాణం ఉండాల్సిన దగ్గర, గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని లీకులిచ్చిఆ తర్వాత డబ్బులేదని ఎన్నికలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముందస్తుకు డబ్బులు ఎలా సెటిల్ చేసుకుంటున్నారో మరి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.