బంగారు తెలంగాణా ఎంతవరకు వచ్చింది ?

Is this the Real Bangaru Telangana what we are looking for

Is this the Real Bangaru Telangana what we are looking for

తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బంగారు తెలంగాణా తయారు చేయడమే లక్ష్యంగా తెలంగాణా సర్కార్ పనిచేస్తోందని టిఆర్‌ఎస్ చెబుతున్నప్పటికీ వాస్తవికతకు ఎంత దగ్గరల్లో ఉందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నలా మారింది. దీంతో సోషల్ మీడియాలో బంగారు తెలంగాణా ఎంతవరకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. మరోవైపు బంగారు తెలంగాణా ఎంతవరకు వచ్చిందని కొన్ని ప్రశ్నలు వైరల్‌గా తిరుగుతున్నాయి.

బంగారు తెలంగాణా ఎంతవరకు వచ్చింది ?

1).మూసీనదీ మురికి వదిలిందా?
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన జరిగిందా?
2).కరీంనగర్ లండన్,పారీస్ లాగా అయ్యిందా?
3).నయీం కేసు ఏమైంది?
4).EAMCET లీకేజీ కేసు ఏమైంది?
5).KG To PG విద్య ఎంత వరకు వచ్చింది?
6).గురుకుల పాఠశాల టీచర్ల రిక్రూట్‌మెంటు ఎందుకు క్యాన్సల్ అయ్యింది?
7).దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైంది?
8).ఇండ్లు లేని ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇల్లని ఆశ పెడితివి?
9).స్కైవేలు నిర్మించారా?
హైకోర్టు తెలంగాణాకు తెచ్చారా?
10).ఉద్యమప్పుడు నీతో ఉన్న ఉద్యమ నాయకులు ఇప్పుడు ఏరి?
11).యునివర్సిటిల VC ల నియామాకాలు జరిగాయా?

12).ప్రభుత్వ మెడికల్ కాలేజీలెన్ని వచ్చాయి ?
13).TSPSC చేసిన నియామాకాలెన్ని?
14).మంత్రి వర్గంలో మహిళలేరి?
15).పార్టీ మారిన దళితుడే ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హుడా?
16).ప్రత్యేక తెలంగాణా బిల్లు పార్లమెంటు లో ప్రవేశ పెట్టిన కాంగ్రెస్,మద్దతు ఇచ్చిన BJP లు ద్రోహులు?

రాయల తెలంగాణా,హైదరాబాద్ UT అని చెప్పిన MIM నిజాయితీ గలవారా?
17).ప్రత్యేక తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టినపుడు పార్లమెంటు లో TRS బలమెంతా?
18).మీరు చేస్తే ఉద్యమం అదే మేం చేస్తే ద్రోహామా?
19).సింగరేణీ వారసత్వ ఉద్యోగాల విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వపై కుట్రనా?
20).మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధం అంటే అది అంబేద్కర్ కుట్ర అంటావా??
21).ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఇబ్బడి ముబ్బడి పెంచితే రాష్ట్రం అబివృద్ధి చెందినట్లా?
22).నిరుద్యోగులు,ప్రైవేటు ఉద్యోగులు ఏట్లో కొట్టుకొని పోయిన ఫర్వాలేదా?
సూటిగా ప్రశ్నిస్తే తెలంగాణా ద్రోహులమా?
అవకాశం వచ్చినపుడు మేం ఏంటో చూపిస్తాం?

– అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసినందుకు ఇప్పుడు ఏడుస్తున్న ఒక తెలంగాణ యువకుడు

 

ఈ ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా సర్క్యులేట్ అవుతోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.