‘రోగ్’ ఓ క్యూట్ లవ్ స్టోరీ

Ishan-MannaraChopra-Angela-Puri-Jagannadh-Rogue-Telugu-Movie-is-a-cute-love-story

Ishan-MannaraChopra-Angela-Puri-Jagannadh-Rogue-Telugu-Movie-is-a-cute-love-story

 

 

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్నలవ్ ఎంటర్‌టైనర్ ‘రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ). ఇషాన్‌ హీరోగా, మన్నారా చోప్రా హీరోయిన్‌గా తెరకెక్కిన రోగ్ ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, కన్నడ భాషల్లో విడుదలకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే

‘ఈ సినిమాలో ఇషాన్తోపాటు చాలామంది కొత్త ఆర్టిస్టులు పరిచయం అవుతున్నారు. కొత్త హీరోకి  ఇంట్ర‌డ‌క్ష‌న్ మూవీగా ఓ క్యూట్ ల‌వ్‌స్టోరీ అయితే బావుంటుందని అనిపించి చేసిన క్యూట్ ల‌వ్ స్టోరీయే `రోగ్‌`. విల‌న్‌గా చేసిన అనూప్ సింగ్ ఠాకూర్ కూడా ఇండస్ట్రీకి కొత్తవాడే. సినిమా మొత్తం కలక‌త్తా బ్యాక్‌డ్రాప్‌లో జ‌రుగుతుంది. అలాగే హైద‌రాబాద్‌,బెంగ‌ళూరుల్లో కూడా సినిమాను తెరకెక్కించాం. నేను హీరోల‌ను ఎలివేట్ చేసే తీరు బావుంటుంద‌ని నిర్మాత‌లు న‌మ్మి, ఒక మాస్ హీరోలా ఇషాన్‌ను ప‌రిచ‌యం చేయ‌మ‌ని అడిగారు. అందుకే ఇషాన్‌ను రోగ్‌లో నా స్టైల్లో ర‌ఫ్‌గా చూపించాను.

ఇడియ‌ట్ అనే టైటిల్ పెట్టిన‌ప్పుడు చాలా మందికి అర్థం కాక‌పోవ‌చ్చనే ఉద్దేశ్యంతో చంటిగాడి ప్రేమ‌క‌థ అని ట్యాగ్‌లైన్ పెట్టాం. ఇప్పుడు రోగ్ కూడా అలా క‌నెక్ట్ కావాల‌నే ట్యాగ్ లైన్‌పెట్టాను. నేను చాలా రోజుల త‌ర్వాత చేసిన ల‌వ్ స్టోరీ రోగ్‌. ఇడియ‌ట్‌లో హీరో చాలా యార‌గెంట్‌గా ఉంటే, రోగ్ చిత్రంలో చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఇద్ద‌రి చంటిగాళ్ళ‌కు తేడా చాలా ఉంటుంది. ఇషాన్ కచ్చితంగా మంచి హీరోగా ఇండస్ట్రీలో కొన్నాళ్ల పాటు వుంటాడన్నది నా పూర్తి నమ్మకం.సెట్ లో చూసినవాళ్లు, రష్ చూసిన వాళ్లు, సెన్సారు కాపీ చూసిన వాళ్లు అందరూ ఇదేమాట చెబుతున్నారు. కేవలం మనిషి అందంగా వుండడమే కాకుండా, నటనలో కూడా మాంచి ఈజ్ వుంది. యూత్ కు నచ్చేందుకు వీలుగా వివిధ రొమాంటిక్ స్టిల్స్ వదిల్తే వదిలి వుండొచ్చు కానీ, సినిమా మాత్రం హ్యాపీగా ఫ్యామిలీతో సహా అందరూ చూడొచ్చు. జయాపజయాలు తాను పెద్దగా పట్టించుకోను. ఓ సినిమా తరువాత మరో సినిమా మీదకు వెళ్లిపోతాను.

యంగ్ జనరేషన్ తో పనిచేయడానికి ఇష్టపడుతాను. వాళ్ళ ఐడియాలజీ కొత్తగా వుంటుంది’ అన్నారు పూరీ జగన్నాథ్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.