రాధిక శరత్‌కుమార్లకు ఐటీ శాఖ సమన్లు

IT department summons notices to Radhika Sarathkumar in Radon

IT department summons notices to Radhika Sarathkumar in Radon

తమిళనాడులో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. పళనిస్వామి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత ఆమె ప్రాతినిధ్యం వహించిన ఆర్కె‌నగర్‌కు ఉపఎన్నిక వచ్చిన తర్వాత ఈమధ్య మార్పులు మరీ ఎక్కువయ్యాయి. తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణల్లో శరత్‌కుమార్ ఇంటితోపాటు, రాధికకు చెందిన రాడాన్ కార్యాలయంలో ఇప్పటికే సోదాలు నిర్వహించారు. మంత్రి విజయభాస్కర్‌తోపాటు పార్టీకి చెందిన మరికొంతమంది నాయకుల ఇళ్ళలో ఆదాయపన్నుశాఖ దాడులు నిర్వహించింది. ఆ తర్వాత మంత్రి విజయభాస్కర్‌కు నోటీసులు జారీచేసింది ఐటీశాఖ.

ఈ నేపథ్యంలో ప్రముఖ సినీనటులు రాధికా శరత్‌కుమార్ దంపతులకు ఐటీశాఖ సమన్లు జారీచేసింది. మంత్రి విజయ్‌భాస్కర్ నుంచి శరత్‌కుమార్‌కు 7 కోట్ల రూపాయలు ముట్టినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. అంతేగాక రాడాన్ మీడియాకు డబ్బు మళ్లించినట్లు ఆరోపణల నేపథ్యంలో.. రాడాన్ కార్యాలయంలో ఐటీ శాఖ అధికారులు రెండో రోజూ సోదాలు కొనసాగిస్తున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.