చంద్ర’బాబా’ మజాకా???

IYR Krishna Rao sacked from Brahmin Welfare Corporation Chairman post on Facebook issue

రెండేళ్ళపాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఎక్కడా ఒక్క వివాదంలో కూడా తలదూర్చకుండా తన విధులు నిర్వహించిన ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు. ఆయన రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం ఏరి కోరి మరీ ఆయనను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పోరేషన్‌కు ఛైర్మన్‌గా నియమించిన తర్వాత ఆయనపై ఒత్తిళ్ళు చాలా ఎక్కువగానే పనిచేశాయి. అయితే సోషల్ మీడియాలో బ్రాహ్మణ కార్పోరేషన్‌ ఛైర్మెన్‌గా ఉన్న ఐవైఆర్‌ తమవైపే అస్త్రాలు ఎక్కుపెడుతుండటంతో అధికార పార్టీలో కలవరం మొదలై… ఐవైఆర్‌ తీరుపై గుర్రుగా ఉన్న టీడీపీ అధిష్టానం ఎట్టకేలకు ఆయనపై వేటు వేసింది.

IYR Krishna Rao sacked from Brahmin Welfare Corporation Chairman post on Facebook issue

సోషల్ మీడియాలో కృష్ణారావు చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించింది. అంతేగాక సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులు ఐవైఆర్‌ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మనసుకు నచ్చని కాపురం ఎన్నాళ్లని చేస్తారు? దయచేసి మీ పదవికి రాజీనామా చేసి, ఇన్నాళ్లు ఈ కాపురం చేసినందుకు భాధపడుతున్నాం అని చెప్పి, తప్పులు నిరూపించండంటూ సవాల్ విసురుతున్నారు.

అందులో భాగంగానే ఐవైఆర్ కృష్ణారావుపై చంద్రబాబు నాయుడు సర్కార్ అనూహ్య వేటు వేసింది. టీడీపీ నేతల ఫిర్యాదుతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే అర్ధాంతరంగా ఉన్నత హాదాలో ఉన్న వ్యక్తిని అడిగి వివరణ తెలుసుకోకుండానే తొలగించడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరోవైపు ఐవైఆర్‌‌కు సైతం ఈ ఘటనకు సంబంధించి అసలు వెనక ఏం జరుగుతోందన్న దానిపై వివరణ ఇచ్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. అందులోభాగంగానే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వివరణ ఇచ్చేందుకు ఐవైఆర్ సిద్ధమయ్యారు.

ఇటీవల పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌ను అరెస్టు చేయడం పట్ల ఐవైఆర్‌ కృష్ణారావు తన ఫేస్ బుక్ ఖాతాలో అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చేసే కామెంట్స్‌ను ప్రభుత్వం ఇంత సీరియస్‌గా తీసుకోకుండా ఉండాల్సిందనేలా ఆయన కామెంట్స్ ఉన్నాయి. అంతేగాక ప్రధాని మోడీతో ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి భేటీని టీడీపీ నేతలు తీవ్రంగా దుయ్యబట్టినప్పడు ఐవైఆర్ జగన్ తరుపున నిలిచి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేలా ఫేస్‌బుక్‌లో ఆయన చేసిన పోస్టుల్లో చాటుకున్నారన్న విమర్శలు చేస్తున్నారు టీడీపీ మద్దతుదారులు. అంతేగాక టీడీపీ, బీజేపీకి చురకలంటించేలా ఉండే పోస్టులను ఫేస్‌బుక్‌లో షేర్ చెయ్యడమేకాకుండా అప్పుడప్పుడు ఆయనే డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

చంద్రబాబు కులపిచ్చిని బయటపెట్టిన విదేశీ విద్యార్థిని అన్న మరో పోస్టును సైతం ఐవైఆర్ షేర్ చేశారు. దాంతో పాటు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు టాక్స్ మినహాయింపు ఇవ్వడం పట్ల కూడా ఐవైఆర్ అభ్యంతరం వ్యక్తం చేయడం టీడీపీకి ఆగ్రహం తెప్పించేదిగా మారింది. ఏ ప్రాతిపదికన ఈ సినిమాకు టాక్స్ మినహాయింపునిచ్చారని ఆయన తన ఫేస్‌బుక్ పోస్టులో ప్రశ్నించారు. ఎవరైనా చరిత్రకారులు ఈ సినిమా చూసి.. చారిత్రకంగా ఇది సరైన సినిమాయే అని నిర్దారించారా? లేదు కదా.. మరలాంటప్పుడు ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఎలాఇస్తారని ఫేస్‌బుక్ సాక్షిగా నిలదీశారు. సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వంపై అస్త్రాలు ఎక్కుపెట్టారు.

పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌ను ప్రభుత్వం అరెస్టు చేయించిన నేపథ్యంలో.. గతంలో చంద్రబాబు అండతో ఎన్టీఆర్ ను కించపరిచేలా వేసిన కార్టూన్స్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో ఎన్టీఆర్ ను కించపరిచేలా ఈనాడు వేసిన కార్టూన్స్‌ను ఐవైఆర్ షేర్ చేశారు.  ఇలాంటి పోస్టులను ఐవైఆర్ షేర్ చేయడంతో ఆయన అధికార పార్టీకే పక్కలో బల్లెంలా మారుతున్నారని టీడీపీ మద్దతుదారులు చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు.

ఐవైఆర్ వైసీపీకి ఫ్రీలాన్సర్‌గా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ అభిమానులు ఫేస్‌బుక్‌లో చాలా ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక ఐవైఆర్ వ్యవహారంపై టీడీపీ అభిమానులు, మద్దతుదారులు ఫేస్‌బుక్‌లో ఆయనపై యుద్దమే చేశారు. ఐవైఆర్ రాజీనామాకు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. వీటికతోడు టీడీపీ నాయకులు విషయాన్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లడంలో వారు సఫలమయ్యారు. దీంతో ఐవైఆర్ వైఖరిని తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు సర్కార్ ఆయనపై వేటు వేసింది.

అయితే కార్పొరేషన్ నిధులపై ఐవైఆర్ ప్రశ్నించడాన్ని తట్టుకోలేకే సీఎం చంద్రబాబు ఆయనను తప్పించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. బ్రాహ్మణ పరిషత్‌ నిధులను తాము సిఫారసు చేసిన వాళ్ళకే ఇవ్వాలని టిడిపి ఎమ్మెల్యేలు పట్టుబట్టినా ఐవైఆర్ లొంగనందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

అంతేగాక ఐవైఆర్ స్థానంలో వేమూరి ఆనంద సూర్యను చైర్మన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు సర్కార్ తీరును రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలు తప్పుపడుతున్నాయి.  కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఎలా తొలగిస్తారని బ్రాహ్మణ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published. • RGV says:

  Brahmanudaina IYR meeda takshname action theesukunnavu. Mari chinthamaneni prabhakar, JC garimeeda yenduku action theesukoledu.

 • కొణిజేటి చిన వెంకటేశ్వర్లు says:

  నిజాయితీ కి విలువనివ్వక పోయే ఎవరూ మనలేరు

 • RAMESH says:

  U r municipal minister supporting corruped officers y u r not taking any action on him

 • RAMESH says:

  U r municipal minister supporting corrupted officers y u r not taken any action on him .