చంద్రబాబు అంత బిజీనా??

IYR Krishnarao clarifies on the Facebook comments issue

ఒక సాధారణ వ్యక్తి ముఖ్యమంత్రిని కలవడం ఎంత కష్టమో ఒక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఒక కార్పోరేషన్‌కి ఛైర్మెన్‌గా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే, అదో పెద్ద విషయం ఏమాత్రం కాదు. తను అనుకున్నప్పుడు వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడం చాలా ఈజీ.  అయితే అందరూ అనుకుంటున్నట్లు సీనియర్ ఐఎఎస్ అధికారులకు కూడా ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి దర్శనభాగ్యం దొరకడం కలగానే మిగిలిపోతుంది. అధికారిక పనులకోసం కలవాలనుకున్నప్పటికీ ఆరు నెలలు గడిచినా ముఖ్యమంత్రి ఆఫీసు దర్శనం టోకెన్ ఇవ్వకుండా ఉండే వేచిఉంచే సంస్క‌ృతి మన దగ్గర మొదలైంది. భజన చేసే బృందంలో లేకపోతే, తాము చెప్పినట్లు నడుచుకోకపోతే ఎంత సీనియర్ ఐఏఎస్ అధికారులకైనా కష్టాలు తప్పవన్నట్లుగా తయారైంది ఏపీలో ప్రస్తుత పరిస్థితి.

IYR Krishnarao clarifies on the Facebook comments issue

బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి షేర్‌ చేసిన కొన్ని పోస్ట్‌లు, ఆయన స్వయంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అలజడి సృష్టించింది. అందులోభాగంగా బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి నుండి ఐవైఆర్ క‌‌ృష్ణారావుని తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదే సమయంలో హైదరాబాద్‌లో ఐవైఆర్ క‌ృష్ణారావు మీడియాతో అనేక సంచలన విషయాలను పంచుకున్నారు.

ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత తానే కావాలని అడిగి మరీ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని అడిగి తీసుకున్నానని తెలిపారు ఐవైఆర్. ఆ తర్వాత  బ్రాహ్మణ కార్పోరేషన్‌ను నడపడమే తన ఉద్దేశ్యమని, తను ఏం తప్పు చేశానని ఇలా విరుచుకుపడుతున్నారని ప్రశ్నించారు. ఫేస్‌బుక్‌లో తాను షేర్ చేసిన పోస్టులకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చిన ఐవైఆర్ తన పని విషయంలో జవాబుదారిగానే వ్యవహరించానని స్పష్టంచేశారు.

‘ నాలుగుసార్లు సీఎం పేషీలోకి పోయి శ్రీనివాస్ దగ్గర కూర్చొని నాలుగు నాలుగు గంటలు ఉన్నాను. రెండుసార్లు ధర్మ దర్శనం అయ్యింది.. రెండు సార్లు దర్శనం కాలేదు. ఒకసారి తిరిగొచ్చి ఒక సీనియర్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాను.. ఆయనకు నా ఇగో బాగా హట్ అయ్యిందని చెప్పాను.. నా ఇగో హట్ అయ్యినా నేను ఫీల్ అవ్వడం లేదు ఇంకోసారి ట్రైచేస్తాను అని ఆయనకు చెప్పాను. చివరకు ఆయన పీఎస్‌కు ఒక మాట చెప్పి వచ్చాను.. మీకు ఐదు నిమిషాల అపాయింట్‌మెంట్ ఇవ్వడం కుదరకపోతే సీఎంతో పాటు నన్ను విమానం ఎక్కించండి.. ఇష్యూస్ చాలా ఉన్నాయి డిస్కస్ చేస్తానని చెప్పాను.. కారణం ఏమైందో తెలియదు ఆ తర్వాత ఆరు నెలల తర్వాత సీఎంని కలిశాను.’ అంతేగాక అనేక విషయాల్లోనూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం నచ్చకనే ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాలను వ్యక్తపరిచానని తెలిపారు.

బ్రాహ్మణ కార్పోరేషన్ సమావేశాలు జరిగినప్పుడు ఆ జిల్లాకు చెందిన స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత జిల్లా కోఆర్డినేటర్లదే ఉంటుంది. వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలకు చెప్పకుండా వైసీపీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇస్తే అది తన తప్పు ఎలా అవుతుందని , 13 జిల్లాల కోఆర్డినేటర్లు కూడా టీడీపీ కార్యకర్తలేనని స్పష్టంచేశారు.

ఫేస్‌బుక్ పోస్టులకు సంబంధించి ఇప్పటిరవకు ప్రభుత్వం తరుపున ఒక్కరు కూడా అధికారికంగా అడగలేదని, అయితే ఎవరెవరో ఫోన్ చేసి వాటి గురించి నా సంజాయిషీ అడగుతున్నారని చెప్పారు. అంతేగాక సీఎం కానీ సీఎంఓ నుండి ఎవరైనా ఫోన్ చేసి ఉంటే రాజీనామా చేసి ఉండేవాడినని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజాలు చాలా తెలియాల్సిన అవసరం ఉందన్నారు ఐవైఆర్. టీటీడీ ఈఓగా ఉత్తరాది అధికారిని నియమించినప్పుడు, జెసి దివాకర్‌రెడ్డి ఇండిగో అధికారులతో గొడవపడ్డప్పుడు, సోషల్ యాక్టివిస్ట్ రవికిరణ్‌ను అరెస్ట్ చేసినప్పుడు ఫేస్‌బుక్‌లో తాను చేసిన పోస్టులకు కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు.

అంతేగాక చారిత్రాత్మక సినిమా తీస్తానని గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను ఎలా తీసారో అందరూ చూశారనని అందుకే దానికి రాయితీలు ఇవ్వడాన్ని వ్యతిరేకించానన్నారు. బాహుబలి సినిమా విషయంలోనూ తన వైఖరిని చాలామంది తప్పుబట్టారని గుర్తుచేశారు. చంద్రబాబు లగడపాటిని కలిస్తే ఎలాంటి తప్పు లేనప్పుడు తాను బాపట్ల వెళ్ళినప్పుడు అక్కడి లోకల్ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు ఐవైఆర్ క‌ృష్ణారావు. అంతేగాక ఏదో ఎమ్మెల్యే అవ్వాలని తనకు ఉందని బయట జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలనే ఉద్దేశ్యం తనకు ఏమాత్రంలేదని స్పష్టంచేశారు ఐవైఆర్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • Madhavacharya says:

    Excellent sir please go never back we support u as brahmin