చిల్లర షోలకు ఫుల్‌స్టాప్ పడేనా???

jabardasth-and-patas-entertaining-people-in-an-indecent-way

jabardasth-and-patas-entertaining-people-in-an-indecent-way

రాను రాను జనాల్లో విశృంఖలత్వం పెరుగుతున్న కొద్దీ ఏం చేస్తున్నారు… ఏం మాట్లాడుతున్నారన్న దానిపై ఏమాత్రం సోయిలేకుండా వ్యవహరించడం కామన్ అయిపోయింది. అన్న మాటలు అనేసి, నేనలా అనలేదు, మీరే తప్పుగా ఆలోచిస్తున్నారు అని పనికిమాలిన సంజాయిషీలు ఇస్తూ సిగ్గులేకుండా సమర్థించుకొనే నైజం మరీ ఎక్కువైంది. మరికొంతమంది వాళ్ళు మాట్లాడినదానికి తమ ప్రమేయం ఏమాత్రం లేదనే విధంగా అంతా నిర్వాహకులదే… వాళ్ళు డబ్బులిచ్చి ఏం చేయమంటే అది చేస్తాం… అంతదానికి నన్నెందుకు గొడవల్లోకి లాగుతారని దబాయించడం కూడా కామన్ అయిపోయింది.

ఈ మధ్య మన టీవీల్లో కామెడీ షోల పేరుతో వస్తున్న చిల్లర షోలను నిషేదించాలని ఉన్న డిమాండ్ కాస్తా “చలపతి ఫిల్మ్స్ సమర్పించు రారండోయ్ పక్కలోకి” అనే మహా ఎపిసోడ్ సందర్భంగా మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఇంత దగుల్భాజీ చిల్లర షోల్లో మగోళ్ళకే చీర కట్టి జాకెట్ వేసి, కిలోలు కిలోలు మేకప్ వేసి చూస్తేనే వాంతులయ్యేలా  అసహ్యంగా కనిపించేలా తయారుచేసి అదేదో గొప్ప కామెడీ చేస్తున్నాం మీరంతా నవ్వుకోండని జనాలపైకి రుద్దడం మరీ ఎక్కువైంది. దీనికితోడు టీవీల ముందు కూర్చొని ఏదో చాలా మంచి షో మిస్ అయిపోతున్నారన్నట్లు మనోళ్ళు తెగ ఫీల్ అయిపోయి ఇంటిల్లిపాది మొగుడు, పెళ్ళాం పిల్లలు అందరూ టీవీలకు అతుక్కొనిపోయి ఆ పనికిమాలిన షోల్లో వస్తున్న డబుల్‌మీనింగ్ డైలాగులను, అడల్ట్ కామెడీని, వల్గర్ కామెంట్లను ఆఖరికి జడ్జిల స్థానంలో కూర్చొనే మేధావుల వెకిలినవ్వులను కూడా ఎంజాయ్ చేసే స్థాయికి దిగజారిపోయాం.

అందుకే ఇప్పటివరకు ఎంతోమంది ఎన్నిరకాలుగా అలాంటి పనికిమాలిన చెత్త చిల్లర షోలను ఆపాలని ఫిర్యాదులు చేసినా అలాంటి షోలు ఏమాత్రం తగ్గకపోగా ఇంకా రెండు మూడు షోలు కొత్తగా వచ్చి చేరి బూతుల రేంజ్‌ని పెంచేశాయి. టీఆర్పీ రేటింగ్‌లు – మార్కెటింగ్ స్ట్రాటెర్జీలో భాగంగా జనాలు మన షోలను బాగా ఎంజాయ్ చేస్తున్నారు అవసరమైతే డోసేజ్‌ పెంచడని ఆదేశాలు వస్తుండడంతో ఈమధ్య కామెడీ, డ్యాన్స్ షోల్లో విచ్చలవిడితనం మరీ ఎక్కువైంది. జనాలను ఎంటర్‌టైన్ చెయ్యాలి కాబట్టే మేం ఇదంతా చేస్తున్నామని యాంకర్లు, కామెడీ స్కిట్లు వేస్తున్న నటులు ఎంత సమర్థించుకున్నప్పటికీ మనం ఎతంవరకు కరెక్ట్‌గా ఉన్నమని వేసుకొనే స్వీయ ప్రశ్నలకు సమాధానం కూడా దొరకదు. డబ్బులిస్తున్నారు కాబట్టి నిర్వాహకులు చెప్పినవిధంగా మేం చేస్తున్నామని సమర్థించుకోవడం ముమ్మాటికీ తప్పే.

నటుడు చలపతిరావు అన్న మాటలకు సంజాయిషీ ఇస్తూ పాత అంశాలపైనే చర్చకు మళ్ళీ తెరలేపారు. మహిళలను కించపరుస్తూ దాదాపుగా గంటన్నర్ర సేపుగా సాగుతున్న ‘డబుల్ మీనింగ్ డైలాగ్’ల షోలను మీ ఆడవాళ్ళే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని, అలాగే మీ ఆడ జడ్జిలే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారని, అలాంటి కార్యక్రమాలకి యాంకర్లు కూడా మహిళలేనని, వారంతా ఎంజాయ్ చేస్తూ ప్రోత్సహిస్తుండగా, వాటినే టీవీలలో ఇళ్ళల్లో మహిళలు, ఫ్యామిలీలు చూసి ఎంజాయ్ చేస్తుండగా తాను అన్నమాటని పట్టుకొని రాద్ధాంతం చేయడం ఎతంవరకు సమంజసం అనే చర్చకు తెరలేపారు. చలపతిరావు మాట్లాడినది ముమ్మాటికీ ఆలోచించాల్సిన విషయమే. డబ్బులిస్తున్నారు కదా అని యాంకర్లు, జడ్జిలు, నటులు బూతులను ఎంజాయ్ చేస్తూ సమాజంపై చెడు ప్రభావం కలిగిస్తున్నారన్నది అందరూ ఒప్పుకోవాల్సిందే. అందుకే ఇప్పుడు ఆ చిల్లర షోలను ఆపాలంటూ కొత్త చర్చ జరుగుతోంది.

సాధారణంగా కార్యక్రమాల్లో డోసేజ్ పెరిగిన సందర్భాల్లో సెన్సార్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కానీ అలా కాకుండా ఈ కార్యక్రమం సరాదాకే ఎవరినీ ఉద్దేశించినవికావు అంటూ గ్రాఫిక్ ప్లేట్లేసి ఎటకారంతో పాటు కాస్త బూతు మైకాన్ని జనాల్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. అసలు ఈ షోల్లో యాంకర్ల డ్రెస్సులు డబుల్ మీనింగ్ డైలాగులు ఇలా అన్నీ బూతుల మయమే. ఈమధ్యే సెన్సార్‌నుండి ఈ చిల్లర షోలను ఆపాలంటూ హెచ్చరికలు కూడా జారీఅయ్యాయని త్వరలోనే ఆపేస్తామని నిర్వాహకులు చెప్పారంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పనికిమాలిన చిల్లర షోలను ఆపాలని డిమాండ్ మళ్ళీ తెరపైకి వచ్చింది.

 

– శరత్‌చంద్ర

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • Suurresh says:

    Excellent …..Sharath…