30 ఏళ్ళు సీఎంగా పాలించాలన్నదే నా కోరిక: వైఎస్ జగన్

Jagan announces his plans to CM Chair and Pada yatra from October 27th

వైఎస్సాఆర్సీపీ ప్లీనరీ సమావేశాల వేదికగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం దగా చూస్తూ పాలన చేస్తున్నారని విమర్శించారు.  2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆడిన అబద్ధాలు, మోసాలు కలిసొచ్చినట్లు అనిపిస్తోందని, చంద్రబాబులాగే అబద్ధపు వాగ్దానాలు ఇవ్వాలని చాలా మంది ఎమ్మెల్యేలు తన వద్దకు వచ్చి చెప్పేయాలని ఒత్తిడి తెచ్చారని, అయితే ఆ రోజు తనకు కూడా అది జఠిలమైన సమస్యేనని, అయినప్పటికీ చంద్రబాబు మాదిరిగానే తను కూడా నా అబద్ధాలు చెప్పి ఉంటే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడినని చెప్పుకొచ్చారు జగన్మోహన్‌రెడ్డి. అంతేగాక ముఖ్యమంత్రి కావాలని తనకు బలమైన కోరిక ఉందని, ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 ఏళ్ళు సీఎంగా పాలించాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు జగన్. వైయస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడిగా వైయస్ జగన్‌ను పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 20 నామినేషన్లు ఆయనను బలపరిచాయి. పార్టీ జాతీయ అధ్యక్షునిగా వైయస్ జగన్ ఎన్నికయినట్టు రిటర్నింగ్ అధికారి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధికారికంగా ప్రకటించారు.

Jagan announces his plans to CM Chair and Pada yatra from October 27th

సినిమాలో 13 రీళ్లు హీరో దెబ్బలు తింటాడు. కానీ చివరి 14 రీలులో పై నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు దీవిస్తారు. కథ క్లైమాక్స్‌కు వస్తుంది. విలన్‌ను హీరో చావబాదుడు కొడతాడు. అంతిమంగా గెలిచేది న్యాయం, ధర్మమే అంటూ సినిమా ముచ్చట్లు సైతం ప్లీనరీ వేదిక సాక్షిగా చెప్పుకొచ్చారు జగన్. అంతేగాక అక్టోబర్‌ 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నట్లు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు అన్నొస్తున్నాడని గ్రామ గ్రామాన ప్రచారం చేయాలని అందరికి మంచి కాలం దగ్గర ఉందని చెప్పాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. అక్టోబర్‌ 27న మొదలయ్యే పాదయాత్రను ఆరు నెలల పాటు 3 వేల కిలోమీటర్లు నడుస్తానని, ఇడుపులపాయతో మొదలుపెట్టి మెట్లు ఎక్కి తిరుమల వరకు వెళ్తానని, అక్కడి నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేస్తానని టూర్ ప్లాన్ చెప్పారు జగన్.

See Also: అవినీతి చక్రవర్తి: 56కుంభకోణాలు, 3లక్షల కోట్ల అవినీతి

అంతేగాక వైఎస్ఆర్‌ మాదిరిగానే ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చుతానని, మనమంతా ఒక కుటుంబ సభ్యులమని రాబోయే రోజులు మనవే అని భరోసా ఇచ్చారు జగన్. చంద్రబాబు దుష్ట పరిపాలనకు చరమగీతం పాడి మళ్లీ మహానేత పాలనను త్వరలోనే తెచ్చుకుందామని, అందుకోసం ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేద్దామని వైయస్‌ జగన్‌ తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే తొమ్మిది అంశాలతో ప్రజలకు భరోసా కల్పిస్తామని జగన్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే వైఎస్ఆర్‌ బతికి ఉంటే రాష్ట్రం విడిపోయేదా అని అందరు అంటున్నారని, నాన్నగారు ఉంటే అందరు ఆనందంగా ఉండేవారని చెప్పుకొచ్చారు.

వైఎస్ జగన్ ప్రకటించిన తొమ్మిది పథకాలు
1. వైయస్సార్ రైతు భరోసా
ఐదెక‌రాలలోపు చిన్న స‌న్న‌కారు రైతుల‌కు రూ. 50 వేలు
నేరుగా రైతుల చేతికే అంద‌జేత‌
ఏ పంట పండించుకుంటారో రైతుల ఇష్ట‌మే
 రూ.3 వేల కోట్లతో ధరల స్థీరికరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కల్పిస్తాం.
వరదలు, కరువు వచ్చినప్పుడు తోడుగా ఉండేందుకు రూ.2 వేల కోట్లతో కెలామిటి రిలిఫ్‌ ఫండ్‌ పెడతాం
2. వైయస్సార్ ఆసరా 
డ్వాక్రా సంఘాల పునరుద్ధరణ
వ‌డ్డీలేని రుణాలు అంద‌జేస్తాం
ప్ర‌తి మ‌హిళ‌ను ల‌క్షాధికారిని చేస్తాం
3. పింఛ‌న్లు 
వెయ్యి నుంచి రెండువేలకు పెంపు
4. అమ్మఒడి 
ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఒక్కో విద్యార్థికి నెల‌కు 500
ఐదు నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు నెల‌కు 750
ఇంట‌ర్ విద్యార్థికి నెల‌కు వెయ్యి
5. ప్రతి పేదవాడికి ఇళ్లు 
ఐదేళ్ల‌లో 25 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం
మ‌హిళ‌ల పేరుతో ఇంటి రిజిస్ర్టేష‌న్‌
ఇంటి మీద పావ‌లా వ‌డ్డీకే రుణాలు తెచ్చుకునే అవ‌కాశం
6. ఆరోగ్య శ్రీ 
గ‌తంలో మాదిరిగా ఆరోగ్య‌శ్రీ అమ‌లు
విశ్రాంతిలో ఉన్న దీర్ఘకాలిక‌ వ్యాధిగ్ర‌స్తుల‌కు పింఛ‌న్లు
7. ఫీజు రీయింబర్స్‌మెంట్ 
అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్
విద్యార్థికి ఏడాదికి 20వేల మెస్ బిల్లు
 
8. యుద్దప్రాతిపదికన సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం 
9. మద్య నిషేధం… 

See Also: జగనన్నే నాకు అమ్మా, నాన్న: రోజా

Have something to add? Share it in the comments

Your email address will not be published.