‘కళాతపస్వి’కి జగన్ అభినందనలు

‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్న సందర్భంగా కె. విశ్వనాథ్ కు జగన్ అభినందనలు తెలిపారు.  ప్రతిపక్షనేత జగన్  స్వయంగా విశ్వనాథ్ నివాసానికి వచ్చి, అభినందనలు తెలపడంతో పాటు ఆయన ఆశీస్సులు పొందారు. వచ్చీరాగానే, మళ్లీ వెళ్లేటప్పుడు కూడా విశ్వనాథ్ కు జగన్ పాదాభివందనం చేసి, తన వినయవిధేయతలు చాటుకున్నారు. పుష్పగుచ్ఛం సమర్పించారు.

విశ్వనాథ్ తో జగన్ కొంచెంసేపు ముచ్చటించారు. ఒకప్పటి సినిమా విశేషాలు, అప్పటి విశేషమైన వ్యక్తులు, అవార్డులు, సత్కారాలు తీరుతెన్నులపై సంభాషణ సరదాగా సాగింది. విశ్వనాథ్ సినిమాలు అంటే తమ కుటుంబమంతటికీ ఎంతో ఇష్టమని, ఈ పురస్కారం ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని ఆయన అన్నారు. జగన్ తో పాటు సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి విశ్వనాథ్ కు అభినందనలు తెలిపారు.

మా శర్మ

Have something to add? Share it in the comments

Your email address will not be published.